Jr NTR Dragon Movie: ఒక సినిమా కోసం మన స్టార్ హీరోలు ప్రాణం పెట్టినట్టు వర్క్ చేస్తారనే విషయం మనందరికి తెలిసిందే. సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టరైజెషన్స్ పోట్రే చేయడంలో వాళ్ళేప్పుడు ముందు వరుస లో ఉంటారు. మార్చుకొని డిఫరెంట్ గా వాళ్ళను వాళ్ళు ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం ఆయన విపరీతంగా కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఆయన చేసిన ప్రతి పాత్ర గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టిందే కావడం విశేషం…ఇక ఈ సినిమాతో తను నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికోసమే ఆయన విపరీతంగా కష్టపడుతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షెడ్యూల్స్ శరవేగంగా పూర్తి చేస్తున్న నేపథ్యం లో ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ లో డ్రాగన్ సినిమా నైట్ షూట్ ని ప్లాన్ చేస్తున్నాడు. ఇక గత కొద్దిరోజుల నుంచి చలి తీవ్రంగా ఉండడంతో నైట్ షూట్ అంటే అందరూ భయపడుతున్నారు. కాబట్టి చాలా మంది నైట్ షూటింగ్ అవసరమా అని అంటుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం చలి లేదు ఏం లేదు. నైట్ షూట్ పెట్టేసేయండి అంటున్నాడు.
Also Read: వారణాసిలో ఆ ఒక్క ఫైట్ కోసం అంత ఖర్చు పెడుతున్నారా..?
ఇక ఇదంతా చూసిన అతని అభిమానులు ‘అక్కడుంది పులి దానికి చలితో పనేముంది’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండటం విశేషం…నిజానికి ఎన్టీఆర్ ఒకసారి ఏదైనా సినిమాకి కమిట్ అయితే ఆ సినిమా పూర్తయ్యేంత వరకు ఎండ, వాన, చలి అనే తేడా లేకుండా తీవ్రంగా కష్టపడుతూ ఆ సినిమా అవుటు పుట్ బాగా వచ్చేలా శ్రమిస్తూ ఉంటాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు కూడా చలితో సంబంధం లేదు షూట్ పేట్టేసేయండి అంటూ సినిమా యూనిట్ కి చెప్పినట్టుగా తెలుస్తోంది…ఇక వాటన్నింటిని తట్టుకొని గొప్ప నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ టాప్ పొజిషన్ లో ఉన్నాడనే చెప్పాలి. ప్రస్తుతం పాన్ ఇండియాని షేక్ చేయడానికి రంగ సిద్ధం చేసుకుంటున్నాడు…