https://oktelugu.com/

యాంకర్‌ శ్యామల భర్త కేసులో నిజానిజాలేమిటి ?

యాంకర్‌ శ్యామల భర్తను అరెస్ట్ చేశారనే వార్త వైరల్ కాగానే.. జనం తెగ ఇంట్రస్ట్ చూపించారు, అరె శ్యామల భర్త ఏమి చేసి ఉంటాడు అని ? అదొక చీటింగ్ కేసు అని తేలింది. మధ్యలో ఎవరో మరో మహిళ కూడా ఉందని అన్నారు. ఈ కేసు పై శ్యామల వివరణ కూడా మరీ నాటకీయంగా ఉండటంతో.. జనానికి కూడా ఈ కేసు పై పలు అనుమానాలు పెరిగాయి. మొత్తమ్మీద శ్యామల భర్త లక్ష్మీనరసింహారెడ్డి ఈ ఆరోపణల […]

Written By:
  • admin
  • , Updated On : April 30, 2021 1:02 pm
    Follow us on

    యాంకర్‌ శ్యామల భర్తను అరెస్ట్ చేశారనే వార్త వైరల్ కాగానే.. జనం తెగ ఇంట్రస్ట్ చూపించారు, అరె శ్యామల భర్త ఏమి చేసి ఉంటాడు అని ? అదొక చీటింగ్ కేసు అని తేలింది. మధ్యలో ఎవరో మరో మహిళ కూడా ఉందని అన్నారు. ఈ కేసు పై శ్యామల వివరణ కూడా మరీ నాటకీయంగా ఉండటంతో.. జనానికి కూడా ఈ కేసు పై పలు అనుమానాలు పెరిగాయి. మొత్తమ్మీద శ్యామల భర్త లక్ష్మీనరసింహారెడ్డి ఈ ఆరోపణల పై వివరణ ఇస్తూ తాజాగా ప్రెస్ మీట్ పెట్టాడు.

    మరి తన పై పెట్టిన ఈ కేసు విషయంలో అతను ఏమి అంటున్నాడు ? అసలు ఈ కేసులో నిజానిజాలు ఏమిటి ? గత రెండు రోజుల క్రితం అరెస్టై తాజాగా బెయిల్‌ పై బయటకు వచ్చిన లక్ష్మీనరసింహారెడ్డి మాట్లాడుతూ.. ‘నా పై చాల మోసపూరిత ఆరోపణలు వస్తున్నాయి. అయినా నాకు అండగా నిలుస్తోన్న వారందరికీ కృతజ్ఞతలు. ఆ దేవుడి దయ వల్ల నేను మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాను. అయితే, గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో నా గురించి అనేక కథనాలు వచ్చాయి.

    ఆ కథనాల పై నిజానిజాలు ఏమిటి అని మీతో పంచుకోవడానికి త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వచ్చి వివరణ ఇస్తాను. ఈ కేసులోని నిజానిజాలేమిటి? అన్ని ఆధారాలతో మిమ్మల్ని కలిసి చెబుతాను. అప్పుడే మీకు నిజాలు తెలుస్తాయి. న్యాయం పై, అలాగే న్యాయస్థానం పై నాకు పూర్తి నమ్మకం ఉంది. కచ్చితంగా ఇది తప్పుడు కేసు. ఆ ఆధారాలను రెండు రోజుల్లోనే చూపిస్తాను. ఏ తప్పు చేయకపోయినా కొన్నిసార్లు నిందలు పడాల్సి వస్తోంది. కానీ, ఇలాంటి పుకార్ల పై తప్పకుండా రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ లక్ష్మీనరసింహారెడ్డి తెలిపారు.

    ఇంతకీ లక్ష్మీనరసింహారెడ్డి పై పెట్టిన కేసు ఏమిటయ్యా అంటే.. గండిపేటలో రూ.100 కోట్ల విలువ చేసే నాలుగు ఎకరాల స్థలం ఉందని లక్ష్మీనరసింహారెడ్డి , 2017 ఆగస్టులో తన వద్ద నుంచి రూ.85 లక్షలు నగదు తీసుకున్నాడని ఖాజాగూడకు చెందిన సింధూరారెడ్డి, అతని పై ఈ కేసు పెట్టింది. పైగా తన డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినందుకు, తనను బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపణలు కూడా చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో జయంతి గౌడ్‌ అనే మహిళ హస్తం కూడా ఉందని ఆమెను సైతం అరెస్టు చేశారు పోలీసులు.