OTT Releases This Week: తెలుగు తెర పై భారీ చిత్రాల హడావుడి ఒకపక్క ముమ్మరంగా జరుగుతున్నా.. మరోపక్క మాత్రం ఓటీటీల సందడి తగ్గడం లేదు. రాధేశ్యామ్ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, ఆచార్య వంటి భారీ సినిమాలు అన్నీ థియేటర్ రిలీజ్ కోసం ముస్తాబు అవుతున్నాయి. అయితే, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి,

అసలు ఈ కరోనా కాలంలో సినిమా రంగానికి ఏకైక ఆశా కిరణం నిలిచింది కూడా ఓటీటీలే. కరోనా క్లిష్ట సమయంలో ప్రేక్షకులను అలరించేది కూడా ఓటీటీలే. నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టేది కూడా ఓటీటీ సంస్థలే. పైగా ఓటీటీ సంస్థలు ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ తో వస్తోంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.
ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
అమెజాన్ ప్రైమ్ :
డ్యూన్ (హాలీవుడ్) మార్చి 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

డిస్నీ+హాట్ స్టార్ :
పారలెల్స్ (ఒరిజినల్ మూవీ) మార్చి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

నెట్‌ఫ్లిక్స్ :
బ్రిడ్డిటన్ (వెబ్‌సిరీస్2) మార్చి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

Also Read: అయ్యో .. ఆ హీరోయిన్ ఇలా అయిపోయిందేమిటి ?
ఎంఎక్స్ ప్లేయర్ :
రుహానియత్ (హిందీ) మార్చి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ఊట్ :
హలో (వెబ్‌సెరిస్) మార్చి 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

Also Read: బీజేపీ ఓన్ చేసుకుంది.. ‘ది కశ్మీర్ ఫైల్స్’కు పన్ను మినహాయింపు?
Recommended Video:
[…] Also Read: ‘ఓటీటీ’ : ఈ వారం ‘ఓటీటీ’ చిత్రాల పరిస్… […]
[…] Dil Raju: ఒక సామాన్య డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన దిల్ రాజు, ఇప్పుడు టాలీవుడ్ లోనే నెంబర్ వన్ నిర్మాతగా మారి, థియేటర్లను కంట్రోల్ లో పెట్టుకోవడంతో పాటు.. తనకు భవిష్యత్తులో పోటీ రావొచ్చు అనే అనుమానం ఉన్న యువి, గీతా లాంటి సంస్థలను కూడా తనతోనే కలుపుకుని, మొత్తానికి ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. అయితే, దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత. […]