అవును, హీరోలది పోయేదేం ఉంది.. సినిమాకి కోట్ల రూపాయిలు తీసుకుంటారు. అందుకే షూటింగ్ చేయడానికి వాళ్ళు వస్తారు. కాబట్టి.. అందరూ రావాలి అంటే ఎలా ? పైగా షూట్ లో కనీస జాగ్రత్తలు ఉండట్లేదు అనేది ఇండస్ట్రీలో ప్రతి సినీ కార్మికుడికి తెలుసు. అయినా వాళ్ళు నోరు విప్పలేరు. అసలు కరోనా సోకకుండా మార్గదర్శకాలను షూటింగ్ స్పాట్లో తప్పనిసరిగా పాటించడం సాధ్యం అవుతుందా ? సినిమా మేకింగ్ అంటేనే.. కలిసి చేయాలి. ఇక రొమాన్స్ ఉన్న సీన్స్ ను అయితే కలిసిపోయి చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్స్ లో భౌతికదూరం ఎలా పాటిస్తారు ? ఎలా పాటించగలరు ?
ఇక్కడ మరో సమస్య ఏమిటీ అంటే.. హీరోలు దర్శకనిర్మాతలు అందరికీ అన్ని జాగ్రత్తలు ఉంటాయి. లైట్లు మోసేవాడి పరిస్థితి ఏమిటి ? ఒకవేళ వాడికి కరోనా సోకితే ఏమి చేయాలి ? అప్పుడు సినిమా పక్షులకు కృష్ణ నగర్ కష్టాలతో పాటు కరోనా కష్టాలు కూడా వస్తాయి. అప్పుడు హీరోలు, దర్శకనిర్మాతలు ఎవ్వరూ కనిపించరు. చివరికీ బలి అయ్యేది సినీకార్మికులే. కాబట్టి సెకెండ్ వేవ్ తగ్గేవరకూ షూటింగ్ ల్లో కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదా అసలు షూటింగ్ లనే క్యాన్సల్ చేసుకోవాలి.
లేకపోతే ప్రస్తుతం జరుగుతున్న సినిమాల షూటింగ్స్ లో దాదాపు సగం టీమ్స్ వరకూ కరోనా బారిన పడిన వారే అంటే.. ఇక ఏమనుకోవాలి. ఇప్పటికైనా మేకర్స్ ఆలోచిస్తే బెటర్. ఎలాగూ కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా భారత్ లో రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరో పక్క పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. అలాగే సినిమా రంగం పై కరోనా పంజా విసిరిందనుకుని సినీ కార్మికులు కూడా ఎలాగోలా నెట్టుకోస్తారు. అంతేకాని కరోనా తెచ్చుకోని బలి అవ్వకుండా ఉంటే చాలు. ఏది ఏమైనా కృష్ణ నగర్ కష్టాలు సినిమా పక్షుల్లో ఎక్కువైయ్యేలా ఉన్నాయి.