Pushpa 2: ఒక స్టార్ హీరో సినిమా థియేటర్లోకి వస్తుంది అంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉంటాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఆ సినిమాని చూసి ప్రేక్షకులకు నచ్చితే హిట్ చేస్తారు, లేదంటే ఫ్లాప్ గా మిగిలిపోతుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ జనాలందరూ ఒక్క సినిమా కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమానే పుష్ప 2 అయితే ఈ సినిమాకి ఎందుకింత క్రేజ్ వచ్చింది.
ఎవరికి లేనంత క్రేజ్ ఈ సినిమా ఒక్కదానికి రావడం వెనక కారణం ఏంటి అనే అంశాలను పరిశీలిస్తే… ఈ సినిమాకి మొదటి పార్ట్ గా వచ్చిన పుష్ప సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఇక ఆ సినిమాలో అల్లు అర్జున్ చూపించిన మేనరిజమ్స్ కానీ, నుకుమార్ మేకింగ్ కానీ అకక్కడి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. అందువల్లే వాళ్ళు ఈ సినిమాని వాళ్ళ సొంత సినిమాగా ఆదరిస్తున్నారు. నిజానికి బాలీవుడ్ జనాలు అంత ఈజీగా పక్క భాష హీరోలను ఆదరించారు.
కానీ అల్లు అర్జున్ లాంటి ఒక డైనమిక్ హీరోని ఆదరించడం పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ హవా బాలీవుడ్ లో కొనసాగుతుందనే చెప్పాలి.
ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయి ప్రభంజనం సృష్టించడం పక్కా అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక బాహుబలి 2, కేజీఎఫ్ 2 లకు ఎలాంటి క్రేజ్ అయితే ఉండేదో ఇప్పుడు పుష్ప 2 కి కూడా అలాంటి క్రేజ్ అయితే ఉంది.
కాబట్టి ఈ సినిమా అక్కడ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాతో మరొకసారి అల్లు అర్జున్ తన స్టామినా ఏంటో చూపించబోతున్నాడు అనేది కూడా అర్థమవుతుంది. ఇక రీసెంట్ గా వచ్చిన టీజర్ లో చూపించిన ‘గంగలమ్మ జాతర’ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలెట్ గా నిలవబోతుందనే విషయం చాలా స్పష్టం గా తెలుస్తుంది…