Nagarjuna: రావు గోపాల్ రావు మీద నాగార్జున అరవడానికి కారణం ఏంటి..?

నాగార్జున కెరియర్ స్టార్టింగ్ లో చేసిన కొన్ని సినిమాల్లో ఆయనతోపాటు కాంబినేషన్ లో నటించే నటులు ఒక మూడు, నాలుగు టేకులు తీసుకుంటే నాగార్జునకు చిరాకు పుట్టెదట.

Written By: Gopi, Updated On : February 25, 2024 11:12 am

Nagarjuna

Follow us on

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కింగ్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు నాగార్జున.. ఈయన చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో 100% సక్సెస్ అవుతాయి. ఇక నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దాదాపు 35 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాడు. నాగేశ్వరరావు లెగసీని కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్లడంలో నాగార్జున హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు.

ఇక ఇది ఉంటే నాగార్జున కెరియర్ స్టార్టింగ్ లో చేసిన కొన్ని సినిమాల్లో ఆయనతోపాటు కాంబినేషన్ లో నటించే నటులు ఒక మూడు, నాలుగు టేకులు తీసుకుంటే నాగార్జునకు చిరాకు పుట్టెదట. కొంతమంది నటులు అలా చేస్తే నాగార్జునకి ఓపిక నశించి అన్ని టేకులు ఎందుకు తీసుకుంటున్నారు అని అరిచేవాడట. ఇక అందులో ముఖ్యంగా రావు గోపాల్ రావు లాంటి సీనియర్ నటుడి మీద సైతం నాగార్జున అరిచినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి. అయితే ఇండస్ట్రీ కి వచ్చే ముందే నాగేశ్వర రావు నాగార్జున తో షూటింగ్ లో ఎక్కువ టేకులు తీసుకోవద్దు, మన డైలాగ్స్ ఫటా ఫట్ చెప్పెయ్యలి. సెట్ లో మన వల్ల అసలు టైం వేస్ట్ అవ్వద్దు అని చెప్పాడట. అందువల్లే నాగార్జున మొదటి నుంచి కూడా డైలాగులని ఫటా ఫట్ చెప్పేసేవాడట.

ఎక్స్ ప్రెషన్ విషయం పక్కన పెడితే డైలాగులు మాత్రం మర్చిపోకుండా చెప్పేవారట. దానివల్ల నాగార్జునకి మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుందంటూ అప్పట్లో చాలా వార్తలు కూడా వచ్చాయి. ఇక సినిమా షూటింగ్ లేట్ అయిపోకూడదనే ఉద్దేశ్యంతో నాగార్జున ఫాస్ట్ గా డైలాగులు చెప్పేవాడట. కొన్నిసార్లు కొంతమంది డైలాగులు మర్చిపోవడం గాని, లేదా తడబడటం గానీ చేసినట్లయితే అది నాగార్జున కాంబినేషన్ లో చేస్తే మాత్రం అసలు ఊరుకునేవాడు కాదట. అలా కొన్ని సార్లు సీనియర్ నటుల మీద కూడా నాగార్జున కోపానికి వచ్చినట్టుగా అప్పట్లో మీడియాలో చాలా కథనాలు అయితే వచ్చాయి.

ఇక ఇప్పుడు నాగార్జున చాలా కూల్ గా, నీట్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అప్పటికి ఇప్పటికీ నాగార్జున లో చాలా తేడా వచ్చింది అంటూ తనతో అప్పటినుంచి నటిస్తున్న నటీనటులు చెబుతూ ఉంటారు. ఇక మొత్తానికైతే కింగ్ నాగార్జున ఇండస్ట్రీలో 35 సంవత్సరాల పాటు స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇక ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు…