Kalki Movie: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు బాలీవుడ్ మాత్రమే అని అక్కడ ఉన్న హీరోలు గాని, ప్రేక్షకులు గాని గర్వంగా చెప్పుకునేవారు. కానీ ఎప్పుడైతే తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను చేయడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి చాలా తక్కువ సమయంలోనే పాన్ ఇండియాని శాసించే స్థాయికి తెలుగు సినిమా ఎదగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఈ విషయంలో రాజమౌళిని మనం మెచ్చుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఆయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాకి దారులు వేశారు.
ఇక ఎప్పుడైతే బాహుబలి సినిమాని ఆయన చాలా గొప్పగా తీర్చిదిద్దారో అప్పుడే తెలుగు సినిమా స్థాయి దేశం నలుమూలాల విస్తరించిందనే చెప్పాలి. ఇక అప్పటి నుంచి సౌత్ సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కి నోచుకుంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే మహానటి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నాగ్ అశ్విన్ ప్రభాస్ ని హీరోగా పెట్టి చేస్తున్న ‘కల్కి ‘సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చాలా బిజీగా ఉంది. అయితే ఈ సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు.
కానీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో ఈ సినిమాని మే 30 న రిలీజ్ చేయాలనుకున్న వాళ్లు ఒక 15 రోజులు ఆలస్యంగా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని జూన్ రెండో వారంలో రిలీజ్ చేస్తే మంచిది మళ్లీ జూలై దాకా వెళ్తే కాలేజీ పిల్లలకి హాలీడేస్ అయిపోయి మళ్ళీ కాలేజీలా బాట పట్టే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి దీనివల్ల సినిమా కలెక్షన్ల మీద కొంతవరకైతే ఎఫెక్ట్ పడవచ్చు. కాబట్టి ఈ సినిమాని జూన్ లో రిలీజ్ చేస్తేనే మంచిదని చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.అయితే కల్కి సినిమా అంత లేట్ గా రిలీజ్ అవ్వడానికి గల కారణం ఒక పోస్ట్ ప్రొడక్షన్ సంస్థకి ముందుగా వర్క్ అప్పజెప్పారట.
కానీ వాళ్ళు సక్రమంగా చేయకపోవడంతో అక్కడి నుంచి ఇంకొక సంస్థకి వర్క్ అప్పజెప్పి మళ్లీ మొదటి నుంచి చేయించుకుంటూ రావడం వల్లే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అనేది చాలా లేట్ అవుతుందని సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారం అయితే అందుతుంది… ఇక ఈ వారంలో సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…