Guntur Karam Teaser: టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్స్ లిస్ట్ తీస్తే అందులో మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరి కలయిక లో గతం లో వచ్చిన ‘అతడు’ మరియు ‘ఖలేజా’ చిత్రాలకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు, ‘అతడు’ చిత్రం యావరేజి గా ఆడగా, ‘ఖలేజా’ చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది.
కానీ టీవీ టెలికాస్ట్ లో ఈ రెండు సినిమాలు , మహేష్ సూపర్ హిట్ సినిమాలకంటే కూడా ఎక్కువ TRP రేటింగ్స్ దక్కించుకుంది. అందుకే ఇప్పుడు వీళ్లిద్దరి కలయిక లో వస్తున్న మూడవ చిత్రం ‘గుంటూరు కారం’ పై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మొన్న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేసారు. ఈ టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక విషయం లో చాలా నిరాశకి గురయ్యారు. ఎందుకంటే ఈ టీజర్ కి అతి తక్కువ లైక్స్ రావడమే. ఒక అద్భుతమైన టీజర్ కట్ కి, స్టార్ హీరో కి రావాల్సినంత లైక్స్ రాలేదని, వ్యూస్ పరంగా ఆల్ టైం రికార్డు వచ్చినప్పటికీ అది కేవలం యాడ్స్ వల్ల వచ్చిందని , ఒక క్రేజీ కాంబినేషన్ నుండి వచ్చిన టీజర్ కి లైక్స్ రాకపోవడం చూస్తుంటే మహేష్ క్రేజ్ తగ్గిపోయిందా? అని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.
ఒకప్పుడు మహేష్ ఫ్యాన్స్ తల్చుకుంటే ఎలాంటి టాస్క్ అయినా పూర్తి అవ్వకుండా ఉండేది కాదని, కానీ ఈసారి మాత్రం టార్గెట్ రీచ్ అవ్వలేకపోయామని అంటున్నారు. ఈ టీజర్ కి 23 మిలియన్ వ్యూస్ 24 గంటల్లో రాగ, లైక్స్ కేవలం 348K మాత్రమే వచ్చింది. చాలా మంది మీడియం రేంజ్ హీరోలకు ఇంతకంటే ఎక్కువ లైక్స్ వచ్చాయని అంటున్నారు ఫ్యాన్స్.