Summer Biggest Hit Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకి సైతం పోటీని ఇస్తూ మనవాళ్లు టాప్ లెవల్లో ముందుకు దూసుకెళ్లడం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది… ఇక ఈ సంక్రాంతి సీజన్ కి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి లాంటి నటుడు సైతం మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. మన శంకర వరప్రసాద్ సినిమా 400 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది అంటే మామూలు విషయం కాదు. ఇక ప్రస్తుతం ఇప్పుడు రాబోతున్న సినిమాల విషయంలో మన హీరోలు చాలా వరకు కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారు..ముఖ్యంగా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల విషయంలో ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో సమ్మర్ హీట్ పెంచడానికి పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నాడు. మార్చి 26వ తేదీన వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో సమ్మర్ పండుగ స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైన కూడా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెసును సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఏప్రిల్ 30వ తేదీన పెద్ది సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. అలాగే చిరంజీవి హీరోగా చేస్తున్న విశ్వంభర సినిమా సైతం మే లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది… ఇక వీటితోపాటుగా మరికొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికి ఈ మూడు సినిమాలు మాత్రం సమ్మర్ కానుకగా ప్రేక్షకులను అలరించే ప్రయత్నమైతే చేస్తున్నాయి.
ఇక వీటిలో ఏ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తుంది అనేది తెలియాల్సి ఉంది… ఇక మార్చి 19వ తేదీన ‘టాక్సిక్’, ‘దురంధర్ 2’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవి తెలుగు సినిమాలు కాకపోయినప్పటికి వీటి మీద మంచి అంచనాలైతే ఉన్నాయి…
ఇక అడివి శేషు హీరోగా చేస్తున్న ‘డెకాయట్’ సినిమా కూడా మార్చి నెలలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సమ్మర్ లో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా మెగా హీరోల నుంచి వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘విశ్వంభర’ సినిమాల మీదనే ప్రతి ఒక్కరి ఫోకస్ ఉంది. ఇక వీటిలో ఏ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలుస్తుందనేది తెలియాల్సి ఉంది…