Akhanda Release: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏపీ హైకోర్టు ఊపిరి అద్దింది అని ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ మాటలో కొంతవరకు నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే.. సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. దాంతో కొత్తగా రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాలకు అది పెద్ద ఊరటను కలిగించింది.

అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు థియేటర్ల యాజమాన్యాలు కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించడం శుభపరిణామం. ఎలాంటి భయాలకు లోను కాకుండా దైర్యంగా కోర్టుకు వెళ్లి.. మొత్తానికి తమ హక్కులను కాపాడుకున్నారు సినిమా వాళ్ళు. అయినా సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్లు ఎంతవరకు పెంచుకోవాలో ఒక షరతు పెట్టొచ్చు.
అంతేగాని, అసలు టికెట్ రేటు పెంచుకునే అవకాశమే లేదు అని చెప్పే హక్కు ప్రభుత్వానికి ఎక్కడ ఉంది ?, అందుకే, టికెట్ రేటు పెంచుకునే హక్కు థియేటర్ యాజమాన్యాలకు ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది. పైగా హైకోర్టు ప్రభుత్వ జీవోను కూడా సస్పెండ్ చేసింది. చివరకు గతంలో ఉన్నట్లే.. పాత విధానంలో టికెట్ల రేట్లను నిర్ణయించుకునే అవకాశాన్ని పిటిషనర్లకు కల్పించింది.
అయితే, ఇదే నిర్ణయం అఖండ రిలీజ్ కి ముందు జరిగి ఉంటే ఎంత బాగుండేది ?, అఖండకి వచ్చిన విజయం ప్రకారం ఏపీ కలెక్షన్స్ రెట్టింపు అవ్వాలి. కానీ, టికెట్ రేటు సగానికి సగం పడిపోవడంతో అఖండకు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాలేదు. రాకపోయినా అఖండ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు కలెక్ట్ చేసింది. అదే, టికెట్ రేట్లు గతంలో ఉన్న విధంగా ఉండి ఉంటే,
Also Read: భీమ్లా నాయక్ నుంచి “రానా” కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన మూవీ యూనిట్…
లేదా ఈ జీవో రద్దు ఏదో అఖండ రిలీజ్ కి ముందు జరిగినా.. అఖండ కలెక్షన్స్ మరో లెవల్ లో ఉండేవి. అప్పుడు బాలయ్య ఖాతాలో ఈ పాటికి 150 కోట్లు మార్క్ చేరేది. ఏది ఏమైనా ఈ విషయంలో జగన్ ను నిందించక తప్పదు. కరెక్ట్ గా అఖండ రిలీజ్ కి ఒక రోజు ముందు ఒక పనికిమాలిన జీవోని రిలీజ్ చేసి.. అఖండ కలెక్షన్స్ పై దారుణంగా దెబ్బ కొట్టాడు.
కానీ, చివరకు ఎప్పటిలాగే హైకోర్టు చేతిలో మరో పరాభవాన్ని ఎదుర్కొన్నాడు. ఏది ఏమైనా జగన్ ఏమి చేసినా.. బాక్సాఫీస్ వద్ద బాలయ్య ప్రభంజనాన్ని మాత్రం ఆపలేకపోయాడు. కాకపోతే, బాలయ్య ఖాతాలో 150 కోట్ల మార్క్ పడకుండా ఆపగలిగాడు.
Also Read: సూపర్ స్టార్ మహేష్ బాబు మోకాలికి సర్జరీ… ఆందోళనలో అభిమానులు