Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: మహేష్ భార్యను ఏమని పిలుస్తాడు... బర్త్ డే రోజు బయటపడ్డ వ్యవహారం!

Mahesh Babu: మహేష్ భార్యను ఏమని పిలుస్తాడు… బర్త్ డే రోజు బయటపడ్డ వ్యవహారం!

Mahesh Babu: నమ్రత జన్మదినం నేడు. ఈ సందర్భంగా భార్యపై మహేష్ బాబు ప్రేమ చాటుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. నమ్రత శిరోద్కర్ ఒకప్పుడు టాప్ హీరోయిన్ అండ్ మోడల్. తెలుగులో అంజి, వంశీ చిత్రాల్లో నటించింది. ఆమె ఎక్కువగా హిందీలో నటించారు. వంశీ సినిమా షూటింగ్ సమయంలో నమ్రత… మహేష్ బాబు ప్రేమలో పడింది. షూటింగ్ ముగిసిన చివరి రోజు ఒకరిపై మరొకరు తమ ప్రేమ వ్యక్తం చేసుకున్నారట.

చాలా కాలం వీరి ప్రేమ రహస్యంగా సాగింది. 2005లో సడన్ గా పెళ్లి చేసుకున్నారు. మహేష్ బాబు వివాహం చాలా నిరాడంబరంగా అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. కేవలం ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరయ్యారు. నమ్రతతో వివాహం మహేష్ తండ్రి కృష్ణకు ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. మహేష్-నమ్రతల పెళ్లి వార్త సంచలనం రేపింది. నార్త్ అమ్మాయి తెలుగింటి కోడలిగా అడ్జస్ట్ కాగలదా అనే సందేహాలు కలిగాయి.

అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ నమ్రత గృహిణిగా మారిపోయింది. గౌతమ్, సితారలకు జన్మనిచ్చిన నమ్రత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేవరకు ఆలనా పాలనా చూసుకుంది. ప్రస్తుతం మహేష్ కి సలహాదారుగా, బిజినెస్ ఉమెన్ గా రాణిస్తుంది. మహేష్ సంపాదనను వివిధ రంగాల్లో పెట్టుబడిగా పెట్టి కోట్లు సంపాదిస్తుంది. మహేష్ సక్సెస్ లో నమ్రత పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు.

నేడు నమ్రత పుట్టినరోజు. 1972 జనవరి 22న జన్మించిన నమ్రత 52 ఏట అడుగుపెట్టారు. నమ్రతకు అంత వయసు అంటే నమ్మడం కష్టమే. ఆమె ఇప్పటికీ స్లిమ్ అండ్ ఫిట్ బాడీ మైంటైన్ చేస్తున్నారు. ఆహారం, ఆరోగ్యం, అందం విషయంలో ఆమె చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక ప్రియమైన భార్యకు మహేష్ తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పాడు. ”హ్యాపీ బర్త్ డే ఎన్ఎస్ జీ… మరొక ఏడాది నా జీవితంలో ప్రేమ, ఆప్యాయత నింపినందుకు కృతజ్ఞతలు. నా ప్రతి దినం సంతోషంగా మలిచావు. 2024ను రాక్ చెయ్” అని కామెంట్ చేశాడు.

నమ్రతను మహేష్ ముద్దుగా ఎన్ఎస్ జీ అని పిలుస్తాడని ఈ ట్వీట్ తో తెలిసింది. కాగా నమ్రత మహేష్ కంటే వయసులో పెద్దది కావడం విశేషం. నాలుగేళ్లకు పైగా వీరి వయసులో వ్యత్యాసం ఉంది.

RELATED ARTICLES

Most Popular