పవన్ సినిమా కోసం త్రివిక్రమ్ ఏం చేయలేదా?

మలయాళంలో హిట్ అయిన ‘అయ్యప్పమ్ కోషియమ్’ మూవీ రిమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరో హీరో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీస్టారర్ మూవీ సెట్ అవ్వడానికి కారణం త్రివిక్రమ్ అని.. ఆయనే దీనికి మాటలు,స్క్రీన్ ప్లే అందిస్తున్న విషయం తెలిసిందే. దర్శకత్వం మాత్రం సాగర్ చంద్ర చేస్తున్నారు. కానీ సెట్ లో అన్నింటిని త్రివిక్రమ్ దగ్గరుండి చూసుకుంటున్నారని.. నిజానికి ఆయనే ఘోస్ట్ దర్శకుడు అన్న టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ కు […]

Written By: NARESH, Updated On : August 6, 2021 5:52 pm
Follow us on

మలయాళంలో హిట్ అయిన ‘అయ్యప్పమ్ కోషియమ్’ మూవీ రిమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరో హీరో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీస్టారర్ మూవీ సెట్ అవ్వడానికి కారణం త్రివిక్రమ్ అని.. ఆయనే దీనికి మాటలు,స్క్రీన్ ప్లే అందిస్తున్న విషయం తెలిసిందే. దర్శకత్వం మాత్రం సాగర్ చంద్ర చేస్తున్నారు. కానీ సెట్ లో అన్నింటిని త్రివిక్రమ్ దగ్గరుండి చూసుకుంటున్నారని.. నిజానికి ఆయనే ఘోస్ట్ దర్శకుడు అన్న టాక్ నడుస్తోంది.

పవన్ కళ్యాణ్ కు ఎంతో ప్రియమైన స్నేహితుడైన త్రివిక్రమ్ వల్లే ఈ సినిమా పట్టాలెక్కిందని అంటున్నారు. త్రివిక్రమ్ ఎంట్రీ ఇచ్చాక ఈ కథలో మార్పులు చేర్పులు డైలాగులు మారిపోతాయని అందరూ అనుకున్నారట.. కానీ నిజానికి మలయాళం సినిమా ‘అయ్యప్పమ్ కోషియమ్’ రిమేక్ లో త్రివిక్రమ్ మార్పులు చేర్పూలూ చేసిందేం లేదట.. ఉన్నది ఉన్నట్టుగానే కాస్త స్లైలిష్ గా తీస్తున్నారట.. మలయాళం సినిమాను యాజ్ టీజ్ గుద్దేస్తున్నట్టు టాక్.

అయితే కొన్ని కామెడీ సీన్లను త్రివిక్రమ్ జోడించాడని..అది సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ కోసమేనని తెలుస్తోంది. మలయాళం సినిమాలోని ఎమోషన్, కథ, క్యారెక్టరైజేషన్లనీ త్రివిక్రమ్ ఏమాత్రం ముట్టుకోవడం లేదట.. మిగిలినదంతా సేమ్ టు సేమ్ తీస్తున్నారట.. జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.