https://oktelugu.com/

Ashu Reddy : ఆశు రెడ్డి సినిమాలకు రాకముందు ఆ పని చేసేదట..

కాగా పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా పేరు ఉండే ఆశు రెడ్డి రాబోయే కాలంలో అయినా సినిమాల్లో బిజీ అవుతుందో లేదో చూడాలి.

Written By:
  • NARESH
  • , Updated On : September 13, 2023 / 05:57 PM IST

    Ashu Reddy1

    Follow us on

    Ashu Reddy : సోషల్ మీడియాలో జూనియర్ సమంత గా పేరు తెచ్చుకున్న ఆశు రెడ్డి.. బిగ్ బాస్ షో తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. కాగా రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ చేసి ఆశు రెడ్డి ఏంటి ఇంత హాట్ అయిపోయింది అని అందరి దగ్గర అనిపించుకుంది.

    రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో కొంతమంది యువకుల దగ్గర ఈమె హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మరి కొంతమంది దగ్గర మాత్రం తీవ్ర విమర్శలు తెచ్చిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆశు రెడ్డి గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.

    అసలు విషయానికి వస్తే ఇండస్ట్రీకి రాకముందు ఈమె ఏం చేసేది.. ఆమె సంపాదన ఎంత అన్న విషయాలు తెలుసుకోవాలని ఆమె అభిమానులు ఈమధ్య ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఇండస్ట్రీలోకి రాకముందు 9 to 5 ఉద్యోగం చేశాను అని ఆశు రెడ్డి ఒకానొక ఇంటర్వ్యూలో తెలిపింది. అమెరికాలో ఐటీ జాబ్ చేస్తూ ఉండేదట. అంతేకాదు తన ఉద్యోగం ద్వారా నెలకి 1.20 లక్షల రూపాయలని సంపాదించేదట. అయితే ఇండస్ట్రీకి అనుకోకుండానే తాను ఎంట్రీ ఇచ్చాను అని చెప్పుకొచ్చింది.

    అంతేకాదు తాను చేసిన ఒక మంచి పనిని కూడా ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది. అదేమిటి అంటే తన మొదటి సంపాదనని సింహాచలం అన్నదాన ట్రస్ట్ కి డొనేట్ చేశాను అని వెల్లడించింది.

    ఇక తన మొదటి సంపాదన అలా డొనేట్ చేయడం గురించి ఆమె అభిమానులు ఆమెని సోషల్ మీడియాలో తెగ పొగిరేస్తున్నారు. ఇక బుల్లితెర పైన తెగ అందాలు ఆరుబొస్తోన్న ఆశు రెడ్డికి సినిమా ఛాన్స్ లు మాత్రం పెద్దగా రావట్లేదు. కాగా పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా పేరు ఉండే ఆశు రెడ్డి రాబోయే కాలంలో అయినా సినిమాల్లో బిజీ అవుతుందో లేదో చూడాలి.