Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళ కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో యంగ్ రెబల్ స్టార్ (Young Rebal Star) గా తనదైన రీతులో సత్తా చాటుకున్న ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం పాన్ ఇండియాను శాసించే స్థాయికి ఎదగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక ఎప్పుడైతే బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడో అప్పటినుంచి ఆయన పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరో రేస్ లో ముందుకు సాగుతున్నాడనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే ఆయన రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ఇప్పటికే మూడు సినిమాలు చేశాడు. మరి రాజమౌళికి తనకు మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయనే చెప్పాలి. రాజమౌళి చేసిన సినిమాలన్నింటిలో అతనికి రెండు సినిమాలంటే అసలు నచ్చవట.
ఇంతకీ ఆ సినిమాలు ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఒకటి….ఈ మూవీ అంటే ప్రభాస్ కి అసలు నచ్చదట. ఎందుకంటే రాజమౌళి మొదట ప్రభాస్ తో ఈ సినిమా చేయాలనే అతనికి ఒక కథ వినిపించారట. కానీ ప్రభాస్ మాత్రం ఆ కథ నచ్చకపోవడంతో దానిని రిజెక్ట్ చేసినట్టుగా కొన్ని సందర్భాల్లో తెలియజేశారు.
ఇక ఇదిలా ఉంటే యమదొంగ సినిమా కూడా ప్రభాస్ కి అంత బాగా కనెక్ట్ కాలేదట. ఇక ప్రభాస్ ఒక్కడికే కాదు యమదొంగ సినిమా చాలామందికి నచ్చలేదని చెబుతూ ఉంటారు. ఇక రాజమౌళి వాళ్ళ భార్య అయిన రమా రాజమౌళి కి కూడా రాజమౌళి చేసిన సినిమాల్లో యమదొంగ సినిమా అస్సలు నచ్చదని ఆమె పలు సందర్భాల్లో తెలియజేసింది. కారణం ఏదైనా కూడా ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ గా నిలిచింది.
మొత్తానికైతే రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన రెండు సినిమాలు ప్రభాస్ కు నచ్చకపోవడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా బాట పట్టడమే కాకుండా భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియాలో కూడా నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకోవడానికి ఆయన అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు…