Director Selvaraghavan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన మార్క్ సినిమాలను తీస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్లలో సెల్వరాఘవన్ ఒకరు… పేరుకు ఆయన తమిళ దర్శకుడు అయినప్పటికీ తెలుగులో కూడా ఆయనకు చాలా మంచి మార్కెట్ అయితే ఉంది.ఆయన తీసిన సినిమాలు అన్ని తెలుగులో డబ్ అవుతాయి అందువల్ల ఆయనకి తెలుగులో కూడా మంచి మార్కెట్ అయితే ఏర్పడింది అందులో భాగంగానే ఆయన తీసిన 7/G బృందావన కాలనీ సినిమా అప్పట్లో ఒక కల్ట్ క్లాసికల్ మూవీ గా నిలిచింది. ఈ సినిమాని రీసెంట్ గా రీ రిలీజ్ కూడా చేయడం జరిగింది.
అయితే సెల్వ రాఘవన్ నార్మల్ దర్శకుల మేకింగ్ కంటే డిఫరెంట్ గా ఆయన మేకింగ్ ఉండటం అనేది ఆ సినిమాకి చాలా ప్లస్ అయింది. అయితే సెల్వరాఘవన్ సినిమాలో నటి నటులు నటించాలి అంటే మాత్రం వాళ్ళు ఎక్కువసేపు కండ్లు గిలపకుండ ఉండేలాగా ప్రాక్టీస్ చేయాలని ముందే సెలవరాఘవన్ ఆర్టిస్టులకు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక సీన్ లో ఆ క్యారెక్టర్ల క్లోజ్ షాట్స్ తీసుకునేటప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్ అనేది కండ్లల్లోనే కనిపించే విధంగా ఆయన క్యారెక్టర్స్ ని డిజైన్ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఎంతసేపు కండ్లు గిలపకుండ ఉంటే ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్ అనేది కండ్ల తోనే కన్వే చేసే ప్రయత్నం ఆయన చేస్తాడు కాబట్టి షాట్ ఎంతసేపు ఉంటే నటించే నటీనటులు కూడా అంతసేపు కండ్లు గిలపకుండ యాక్టింగ్ చేయగలగాలి అలా అయితేనే అయన సినిమాల్లో ఆ నటులను పెట్టుకుంటాడు లేదంటే ఇంకో ఆర్టిస్టులకు వెళ్ళిపోతూ ఉంటాడు.
అందుకే సెల్వరాఘవన్ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా రియలేస్టిక్ గా ఉంటూనే ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్ ని పండించడంలో చాలా వరకు సక్సెస్ అవుతూ ఉంటారు. ఆయన తెలుగులో వెంకటేష్ తో తీసిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్ల లోని ఎమోషన్ ని కూడా చాలావరకు వెంకటేష్ గారు ఐస్ తోనే కన్వే చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా వెంకటేష్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.
ఇక సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుందంటే కంప్లీట్ అదొక డిఫరెంట్ జానర్లో వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు.ఆయన ఒకే జానర్ లో సినిమా చేయడానికి ఇష్టపడడు పలు రకాల జానర్లలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే విధంగా తన సినిమాలను మలుస్తూ ఉంటాడు కాబట్టి ఆయన డైరెక్షన్ లో సినిమా అంటే మాత్రం ఆ నటుడు తప్పకుండా కాసేపు కండ్లు గిలపకుండా ఉండగలిగేలా ప్రాక్టీస్ చేయాలని ఆయన సినిమాలో నటించే నటీనటులకు ముందు గానే ఆయన చెప్తూ ఉంటారు…