Varun Tej – Lavanya Tripathi engagement : గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. లావణ్య త్రిపాఠి మెగా కుటుంబం లో ఒకరిగా కలిసిపోవడం, వాళ్ళ కుటుంబం లో జరిగే ప్రతీ వేడుకకు హాజరు కావడం తో , ఇద్దరి మధ్య కచ్చితంగా ఎదో ఉందని అందరూ అనుకున్నారు.
అయితే లావణ్య త్రిపాఠి రీసెంట్ గా పలు ఇంటర్వ్యూస్ లో అలాంటిది ఏమి లేదని, నా ఫోకస్ మొత్తం సినిమాలపైనే అని చెప్పుకుంటూ ఈ వార్తలను కొట్టిపారేసింది. కానీ ఆమె చెప్పింది ఎవ్వరూ నమ్మలేదు. వీళిద్దరి మధ్య కచ్చితంగా ఎదో ఉందని బలంగా నమ్మారు. చివరికి వాళ్ళ నమ్మకమే నిజం అయ్యింది, వీళ్లిద్దరి నిశ్చితార్థం ఈ నెల 9 వ తారీఖున ఘనంగా జరగబోతుంది.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభించేసారు, ఏ క్షణం లో అయినా వీళ్లిద్దరి పెళ్లి వార్త గురించి వరుణ్ తేజ్ అధికారికంగా ప్రకటించవచ్చు. నాగబాబు కూడా పలు ఇంటర్వ్యూస్ లో సోషల్ మీడియా లో ఎప్పటి నుండో ఉన్న ఈ వార్త నిజం అని చెప్పలేదు, అబద్దం అని కూడా చెప్పలేదు. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి కలిసి ఇప్పటి వరకు ‘మిస్టర్’ మరియు ‘అంతరిక్షం’ వంటి సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.
ఆన్ స్క్రీన్ మీద ఫ్లాప్ అయినా , ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఇద్దరూ ఒక్కటి అయ్యారు.చూడడానికి ఎంతో క్యూట్ గా అనిపించే ఈ జంట, ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది అంటూ అధికారిక ప్రకటన రావడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నిశ్చితార్ధ వేడుక టాలీవుడ్ కి చెందిన కొంతమంది ప్రముఖులు మరియు కుటుంబ సభ్యుల మధ్య సింపుల్ గా జరిపించడానికి చూస్తున్నారు.