Homeఎంటర్టైన్మెంట్Sheena Bora: దేశాన్ని కుదిపేసిన కేసుపై వెబ్ సిరీస్ : స్ట్రీమింగ్ ఆపేయాలని కోర్టుకెళ్లిన సీబీఐ,...

Sheena Bora: దేశాన్ని కుదిపేసిన కేసుపై వెబ్ సిరీస్ : స్ట్రీమింగ్ ఆపేయాలని కోర్టుకెళ్లిన సీబీఐ, అసలు ఏం జరిగింది?

Sheena Bora: ముంబైకి చెందిన యువతి షీనా బోరా మర్డర్ కేసు దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై మెట్రో వన్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న షీనా బోరా 2012 ఏప్రిల్ 24న కనిపించకుండా పోయింది. అదే రోజు తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ ముఖర్జియాకు షీనా ఫోన్ నుండి బ్రేకప్ మెస్సేజ్ వచ్చింది. అలాగే ఉద్యోగానికి ఆమె రాజీనామా చేశారు. ఏప్రిల్ 24 తర్వాత ఆమె కనిపించలేదు. అనుమానంతో పోలీసులు షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియా ఓర్లి నివాసానికి వెళ్లారు. షీనా బోరా ఎవరికీ చెప్పకుండా అమెరికా వెళ్లిందని ఇంద్రాణి ముఖర్జియా పోలీసులకు చెప్పారు.

తదుపరి విచారణలో దొరికిన ఆధారాలతో ఇంద్రాణి ముఖర్జియాతో పాటు షీనా బోరా స్టెప్ ఫాదర్ పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జియా కారు డ్రైవర్ శ్యామ్ వర్ పింటూరామ్ రాయ్ ని 2015 ఆగస్టు లో అరెస్ట్ చేశారు. ఇంద్రాణి, పీటర్ సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు. ఇంద్రాణి ముఖర్జియా ఐ ఎన్ ఎక్స్ మీడియా కో ఫౌండర్. ఐ ఎన్ ఎక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిక్రూట్మెంట్ సంస్థను నడిపారు.

షీనా బోరా మర్డర్ కేసు దేశాన్ని కుదిపేసింది. అరెస్ట్ కాబడిన ఇంద్రాణి మీద పలు సెక్క్షన్స్ క్రింద కేసులు నమోదయ్యాయి. ఆమెను ముంబై బైకుల్లా లో గల మహిళా జైలుకు తరలించారు. ఇంద్రాణి ముఖర్జియా దాదాపు ఆరు సంవత్సరాలు జైలులో గడిపారు. ప్రస్తుతం బైలు మీద బయట ఉన్నారు. షీనా బోరా మర్డర్ కేసు ఇంకా కోర్టు విచారణలో ఉంది. కాగా ఈ కేసు ఆధారంగా ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బర్రీడ్ ట్రూత్ టైటిల్ తో డాక్యూమెంటరీ సిరీస్ ని తెరకెక్కించారు. ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

షీనా బోరా మర్డర్ కేసు కోర్టు విచారణలో ఉండగా ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ డాక్యూమెంటరీ ఓటీటీలో స్ట్రీమ్ కావడం పై సీబీఐ అభ్యంతరం చెప్పింది. షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన నిందితురాలిగా ఉన్న నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ లో ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ స్ట్రీమింగ్ ఆపివేయాలని ముంబై స్పెషల్ కోర్టును సీబీఐ ఆశ్రయించింది. కేసు తీర్పు వచ్చే వరకు ఎలాంటి ఫ్లాట్ ఫార్మ్ లో ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ డాక్యూమెంటరీ ప్రసారం కాకుండా ఆదేశాలు ఇవ్వాలని సీబీఐ కోరింది.

సీబీఐ స్పెషల్ జడ్జ్ ఎస్పీ నాయక్ నింబాల్కర్ నెట్ఫ్లిక్స్ సంస్థతో పాటు సంబంధిత వ్యక్తులు నోటీసులు పంపారు. ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 23 నుండి స్ట్రీమ్ కావాల్సి ఉంది. సీబీఐ కోరిన స్టే ఆర్డర్ పై ఫిబ్రవరి 20న విచారణ జరగనుంది.

RELATED ARTICLES

Most Popular