Bharani re-entry into Bigg Boss 9: తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎలాంటి సరైన కారణం లేకుండా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన దాఖలాలు లేవు. సీజన్ 7 లో ఎలిమినేట్ అయిన రతికా రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ అందుకు ఒక ప్రక్రియ ప్రకారం ఆమెని లోపలకు తీసుకొచ్చారు. కనీసం నాలుగు వారాలైనా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పిలిపించి, వారిలో ఎవరు కావాలని అనుకుంటున్నారో వాళ్లకు ఓట్లు వేయమని హౌస్ మేట్స్ తో ఓట్లు వేయించారు. ఆ సీజన్ ఉల్టా పల్టా కాన్సెప్ట్ తో నడిచింది కాబట్టి, అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన రతికా ని హౌస్ లోపలకు పంపించారు. సీజన్ 8 లో అలాంటివేమీ చేయలేదు. కానీ ప్రస్తుతం నడుస్తున్న సీజన్(Bigg Boss 9 Telugu) లో భరణి(Bharani Shankar) ని ఏ కారణం చేత హౌస్ లోకి తీసుకొచ్చారో అర్థం కావడం లేదు.
శ్రీజ అంటే ఆమె ఆడియన్స్ ఓట్ల ద్వారా ఎలిమినేట్ అవ్వలేదు. అప్పటికప్పుడు హౌస్ లోపలకు దూసుకొచ్చిన వైల్డ్ కార్డ్స్ ఓట్లు వేస్తే ఎలిమినేట్ అయ్యింది. ఇది ఆడియన్స్ చాలా అన్యాయం అని ఫీల్ అయ్యారు, మళ్లీ శ్రీజ కి ఒక అవకాశం ఇవ్వాలని సోషల్ మీడియా లో పెద్ద యుద్ధమే చేశారు. ఫలితంగా శ్రీజ హౌస్ లోకి అడుగుపెట్టింది. కానీ భరణి ఆడియన్స్ ఓట్లు వేయకపోవడం వల్ల ఎలిమినేట్ అయ్యాడు. ఆయన్ని హౌస్ లోకి తీసుకొని రావాలంటే, అప్పటికే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఓట్ల ద్వారా తీసుకొని రావడమో, లేకపోతే ఆడియన్స్ ఓటింగ్ ద్వారా తీసుకొని రావడమో జరగాలి. కానీ అలాంటి ప్రక్రియ ఏది లేకుండా, నేరుగా బిగ్ బాస్ నిర్ణయం తో ఆయన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇది ఆడియన్స్ కి న్యాయంగా అనిపించలేదు. భరణి కచ్చితంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్. టాప్ 5 లో ఉండాల్సిన వాడు.
కొంత మెతక మనస్తత్వాన్ని పక్కన పెడితే ఆయనకు టైటిల్ ని కొట్టేంత కెపాసిటీ కూడా ఉంది. అమ్మడులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇలా తీసుకొని రావడం వల్ల బిగ్ బాస్ కి ఒక బ్లాక్ మార్క్ లాగా మిగిలిపోతుంది కదా. ఇద్దరికీ టాస్కులు నిర్వహిస్తాము, ఎవరైతే ఎక్కువ టాస్కులు గెలుస్తారో వాళ్ళు శాశ్వతంగా ఈ ఇంట్లో ఉండిపోతారు అని అంటాడు బిగ్ బాస్. మూడు టాస్కులు నిర్వహించగా, అందులో రెండు భరణి గెలుస్తాడు. బిగ్ బాస్ ఆయన్ని శాశ్వత ఇంటి సభ్యుడిగా ప్రకటిస్తాడు. మరి ఇప్పుడు శ్రీజ ఎలిమినేట్ కానుందా?, అనేది వీకెండ్ వరకు సస్పెన్స్. ఇదంతా పక్కన పెడితే ఆరు వారాల్లో ఎంతో మంది ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఉండగా, భరణి కి మాత్రమే స్పెషల్ అవకాశం ఇవ్వడానికి కారణం?, ఆయన జనసేన పార్టీ కి చెందినవాడు అనే కదా?, నాగబాబు ప్రస్తుతం రాజకీయాల్లో బలమైన స్థానం లో ఉన్నాడు, ఆయన ప్రభావితం చేయడం వల్లే ఎలాంటి షరతులు లేకుండా భరణి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడా అనే అనుమానాలు జనాల్లో ఉన్నాయి.