War 2 Teaser Review: ఎన్టీఆర్ నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2. హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ చేస్తున్న భారీ మల్టీస్టారర్. వార్ చిత్రంలో హృతిక్ రోషన్-టైగర్ ష్రాఫ్ నటించారు. దానికి కొనసాగింపుగా వస్తున్న వార్ 2లో ఎన్టీఆర్ భాగమయ్యాడు. ఇండియాకు దూరమైన మాజీ ఏజెంట్ కబీర్ పాత్రలో హృతిక్ రోషన్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాడు. నేడు ఎన్టీఆర్ బర్త్ డే నేపథ్యంలో వార్ 2 టీజర్ విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషాల నిడివి కలిగిన టీజర్ ఐ ఫీస్ట్ అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్.
Also Read: మహేష్ బాబు సినిమాల్లో ఎన్టీఆర్ కి అసలు నచ్చిన సినిమాలు ఇవేనా..?
మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో వార్ 2 కూడి ఉంది. హాలీవుడ్ చిత్రాలను తలపించే లొకేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, నిర్మాణ విలువలు మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ రేపుతున్నాయి. కబీర్ ని వెంటాడే ఏజెంట్ గా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందని చెప్పకనే చెప్పారు. వీరిద్దరి మధ్య జరిగే పోరు, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్. ఎన్టీఆర్ ని గతంలో మనం ఎన్నడూ చూడని యాక్షన్ అవతార్ లో చూడవచ్చు. ఎన్టీఆర్-హృతిక్ పాత్రలు సమాన ప్రాధాన్యతతో డిజైన్ చేశారని భావించవచ్చు.
కియారా అద్వానీ గ్లామర్ టీజర్ కి మరొక హైలెట్. బికినీలో సూపర్ హాట్ ఫోజులతో కియారా దిమాక్ ఖరాబ్ చేసింది. మొత్తంగా వార్ 2 టీజర్ అంచనాలు పీక్స్ కి తీసుకెళ్లింది. ఈ చిత్రంతో ఎన్టీఆర్ హిందీలో మరింత పట్టు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఆయన ఇమేజ్ నార్త్ లో పెరిగే సూచనలు కలవు. వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆదిత్య చోప్రా కథను అందించారు. ఆయనే ఈ చిత్రానికి నిర్మాతగా ఉన్నారు.
ప్రీతమ్ వార్ 2 చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. వార్ 2 టీజర్ ఆకట్టుకున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
