War 2 OTT: థియేటర్స్ లో ఫ్లాప్స్ గా, డిజాస్టర్స్ గా నిల్చిన ఎన్నో చిత్రాలు, ఓటీటీ లో విడుదల అయ్యాక మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ క్యాటగిరీ లోకి ఆగస్టు 14 న విడుదలైన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం కూడా చేరింది. ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా, భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. హిందీ లో హృతిక్ రోషన్ క్రేజ్ కారణంగా, కాస్త డీసెంట్ గానే ఆడినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మన టాలీవుడ్ స్టార్ హీరోల మొదటి రోజు వసూళ్ల కంటే తక్కువ వచ్చాయి. బహుశా ఎన్టీఆర్ ని విలన్ రోల్ లో చూపించడం ఆడియన్స్ కి నచ్చలేదేమో , ఆ కారణం చేత ఈ చిత్రానికి ఇలాంటి ఫలితం వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసిన కొందరు, రీసెంట్ సమయం లో వచ్చిన స్పై జానర్ మూవీస్ లో ది బెస్ట్ అని, ఈ సినిమా ఎందుకు ఇంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో అర్థం కావడం లేదంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ, ఓటీటీ లోకి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంది అని అంచనా కూడా వేశారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి మొదటి 24 గంటల్లో 3.8 మిలియన్ వ్యూస్ వచ్చాయట. ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఆల్ టైం రికార్డు అని అంటున్నారు.
ఈ చిత్రాన్ని ఓటీటీ లో చూసిన వాళ్లంతా సినిమా బాగానే ఉంది కదా?, ఎందుకు ఫ్లాప్ అయ్యింది?, యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ మూవీ లో చూస్తున్నట్టుగానే అనిపించింది. ఈ రేంజ్ అసలు ఊహించలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పోటాపోటీగా నటించారని, వీళ్లిద్దరి మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు అదిరిపోయాయని, ఆడియన్స్ కి ఇంతకు మించి ఏమి కావాలో అర్థం కావడం లేదని, మంచి సినిమాని ఫ్లాప్ చేసారని ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పై యూత్ ఆడియన్స్ లో మొదటి నుండి పెద్దగా ఆసక్తి లేకపోవడం, ఈ సినిమా విడుదలైన రోజే రజినీకాంత్ కూలీ చిత్రం కూడా విడుదల అవ్వడం, ఆ సినిమాకు ఆడియన్స్ మొదటి నుండి మంచి హైప్ తో ఉండడం వల్ల, కూలీ ఆ మేనియా లో కొట్టుకుపోయిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.