War 2 Movie Collection: ఎన్టీఆర్(Junior NTR) అభిమానులు తమ అభిమాన హీరో ‘రభస’ సినిమా చేసినందుకు చాలా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఈ చిత్రం ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్. కనీసం ఓపెనింగ్స్ ని కూడా భారీగా తెచుకోలేకపోయిన చిత్రమిది. అభిమానులు ఈ సినిమాని చూసి బాగా నిరాశకు గురయ్యారు అని తెలుసుకున్న ఎన్టీఆర్, టెంపర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇక మీదట అభిమానులు కాలర్ ఎత్తుకునే సినిమాలే చేస్తాను అని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం టెంపర్ నుండి దేవర వరకు వరుసగా 7 బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ స్పీడ్ కి బ్రేకులు ఉండవు, ఆయన్ని ఫ్లాప్స్ లో ఇక చూడలేము అని అంతా అనుకుంటున్నా సమయం లో ‘వార్ 2′(War 2 Movie) చిత్రం విడుదలైంది. ఈ సినిమా పై మొదటి నుండి అంచనాలు తారాస్థాయి లో ఉండేవి అభిమానులకు.
Also Read: ఓజీ లో స్పెషల్ క్యామియో రోల్ చేస్తున్న మహేష్ బాబు?
కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోవడం తో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమాకు యాష్ రాజ్ ఫిలిమ్స్ 400 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేసింది. స్పై యూనివర్స్ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా అనొచ్చు. ఎన్టీఆర్ సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు కాబట్టి, ఆయన కారణంగా భారీ వసూళ్లు వస్తాయనే నమ్మకం తో ఉండేవారు. కానీ సౌత్ లో ఈ చిత్రానికి మొదటి రోజు వస్తాయని అనుకున్న వసూళ్ళలో సగం కూడా ఫుల్ రన్ రాలేదు. ఇది మూవీ టీం కి అతి పెద్ద షాక్ అనుకోవచ్చు. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి అన్ని ప్రాంతాలకు, అన్ని భాషలకు కలిపి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నార్త్ అమెరికా లో మరియు ఓవర్సీస్ మొత్తం కమీషన్ బేసిస్ మీద సినిమాలు నడుస్తాయి కాబట్టి, వచ్చిన గ్రాస్ లో సగం థియేటర్స్ యాజమాన్యాలకు పోతుంది.
అంటే పెట్టిన బడ్జెట్ లో థియేటర్స్ నుండి రీకవర్ అయ్యింది కేవలం 130 కోట్ల రూపాయిలు అన్నమాట, అంటే బడ్జెట్ ద్వారానే 270 కోట్ల రూపాయిల నష్టం ఇక్కడే వాటిల్లింది. అదే విధంగా రీకవర్ బేసిస్ మీద కూడా ఈ చిత్రాన్ని అమ్మారట. అంటే నష్టపోయిన బయ్యర్స్ కి రీకవరబుల్ అమౌంట్ కట్టాలి. ఆ రూపం లో కూడా పాతిక నుండి 50 కోట్ల రూపాయిల వరకు నష్టం ఉంటుంది. ఇక ఓటీటీ సంస్థలు ఒకప్పటి లాగా ఇప్పుడు లేవు. సినిమా సూపర్ హిట్ అయితేనే ముందు అనుకున్న రేట్స్ కి డబ్బులు ఇస్తుంది, లేదంటే సగానికి పైగా తగ్గించేస్తుంది. ఇలా మొత్తం మీద ఈ సినిమా కారణంగా యాష్ రాజ్ సంస్థ 400 కోట్ల రూపాయిల వరకు నష్టపోయారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.