Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ కోసం కేవలం మెగా అభిమానులు మాత్రమే కాదు..ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఎందుకంటే చిరంజీవి లోని మాస్ యాంగిల్ నచ్చని ప్రేక్షకుడు ఎవరు ఉంటారు చెప్పండి..ఇండియాలోనే బిగ్గెస్ట్ కమర్షియల్ మాస్ హీరో ఆయన..కానీ రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ మార్కు ఊర మాస్ ఎంటర్టైనర్ పడలేదు..చాలా కాలం తర్వాత చిరంజీవి తన స్ట్రాంగ్ జోన్ అయినా మాస్ ఎంటర్టైనర్ తో ఈ సంక్రాంతికి మన ముందుకి రాబోతుండడం తో ట్రేడ్ లో కూడా ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి..ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా వందకోట్ల రూపాయలకు పైగానే జరిగింది..మెగాస్టార్ గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా కూడా ఇంత భారీ మొత్తం లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం అంటే మార్కెట్ లో ఆయనకీ ఉన్న బ్రాండ్ ఇమేజి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ సినిమాలో చిరంజీవి తో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే..ఇటీవలే ఆయన క్యారక్టర్ కి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..అంతకు ముందు విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి టైటిల్ టీజర్ మరియు బాస్ పార్టీ సాంగ్స్ కూడా బాగా క్లిక్ అవ్వడం తో మూవీ పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నాయి..ప్రస్తుతం చిరంజీవి – శృతి హాసన్ మధ్య ‘శ్రీదేవి’ అనే రొమాంటిక్ సాంగ్ ని ఫ్రాన్స్ లో మంచు కొండల మధ్య చిత్రకరిస్తున్నారు..ఆ లొకేషన్ కి సంబంధించిన వీడియోని మెగాస్టార్ షూట్ చేసి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చెయ్యగా అది తెగ వైరల్ గా మారింది..67 ఏళ్ళ వయస్సు లో మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో చిరంజీవి – శృతి హాసన్ మధ్య తెరకెక్కిస్తున్న ఈ సాంగ్ సినిమాకి హైలైట్ గా నిలవబోతుంది అట.
ఇక ఈ సినిమా జనవరి 13 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే..ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 8 వ తారీఖున వైజాగ్ లో ఘనంగా నిర్వహించనున్నారు..ఈ ఈవెంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ మొత్తం తండోపతండాలు గా తరలి రాబోతున్నారు..మేకర్స్ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చిరస్థాయిగా మెగా అభిమానులకు గుర్తుండిపోయేలాగా చేయబోతున్నారు అట.. అభిమానుల కోసం వైజాగ్ కి ప్రత్యేకంగా ట్రైన్స్ కూడా వెయ్యబోతున్నారట.. అందుకోసం మూడు యూనిట్లుగా కమిటీలను కూడా ఏర్పాటు చేసిందట మైత్రీ మూవీ మేకర్స్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్టు సమాచారం.