Waltair Veerayya 1st song BossParty Song : మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ నాన్ స్టాప్ అప్డేట్స్ తో తడిసిముద్దవుతున్నారు. ఏడాది వ్యవధిలో చిరంజీవి మూడు సినిమాలు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. 2022 ఏప్రిల్ లో ఆచార్య విడుదల చేసిన చిరు, ఏడు నెలల్లో గాడ్ ఫాదర్ అంటూ దిగారు. మరో రెండు నెలల్లో వాల్తేరు వీరయ్య గా సందడి చేయనున్నారు. విడుదల దగ్గర పడుతుండగా మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. దీపావళి కానుకగా వాల్తేరు వీరయ్య టీజర్ విడుదల చేశారు. ఊరమాస్ లుక్ లో చిరు వింటేజ్ చిత్రాలు గుర్తు చేశారు. బ్లాక్ బస్టర్ ముఠామేస్త్రి మూవీ ఫ్యాన్స్ మదిలో మెదిలింది. చిరు మేనరిజం కి ఫిదా అయ్యారు.

కాగా వాల్తేరు వీరయ్య నుండి మరో అప్డేట్ సిద్ధం చేశారు. నవంబర్ 23 సాయంత్రం 4:05 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అప్డేట్ పోస్టర్ లో చిరు కేక పుట్టిస్తున్నారు. ఇది ఐటెం సాంగ్ అనిపిస్తుంది. ఇటీవలే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రాతెలా-చిరు కాంబినేషన్లో మాస్ మసాలా ఐటెం నంబర్ షూట్ చేశారు. అదే ఫస్ట్ సింగిల్ గా విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ గా చెప్పే దేవిశ్రీ బాణీలు అందిస్తున్న ఈ అప్డేట్ పట్ల ఫ్యాన్స్ లో భారీ క్రేజ్ నెలకొని ఉంది.
దర్శకుడు బాబీ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వాల్తేరు వీరయ్య తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ చేసినట్లు సమాచారం. శృతి హాసన్ కెరీర్లో మొదటిసారి చిరుతో జతకడుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో సాగే వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. రవితేజ చిరంజీవి సవతి తల్లి కొడుకని, వీరి మధ్య ఆసక్తికర ఘర్షణ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది.
https://www.youtube.com/watch?v=qN8Pyfb42Ac
అప్పుడెప్పుడో 2000లో విడుదలైన అన్నయ్య మూవీలో రవితేజ చిరంజీవి తమ్ముడు పాత్ర చేశారు. స్టార్ డమ్ వచ్చాక రవితేజ-చిరు కలిసి నటించింది లేదు. ఇన్నేళ్ల తర్వాత కాంబినేషన్ సెట్ అయ్యింది. వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అలాగే బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి మూవీ సైతం సంక్రాంతికి విడుదల కానుంది. ఇక విజయ్ వారసుడు విడుదల విషయంలో వివాదం నడుస్తుంది. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారసుడు సంక్రాంతి విడుదలను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
https://youtu.be/qN8Pyfb42Ac