Vyooham Review : ప్రస్తుతం వెబ్ సిరీస్ లా ట్రెండ్ నడుస్తున్న క్రమంలో ప్రతిరోజు ఓటిటి లోకి చాలా వెబ్ సిరీస్ లు వచ్చి ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు వ్యూహం అనే ఒక వెబ్ సిరీస్ ని ప్రొడ్యూస్ చేశారు.అయితే ఇప్పుడు అది ఓటిటిలో హల్చల్ చేస్తుంది. అందరికీ వ్యూహం అనగానే రాంగోపాల్ వర్మ తీసిన సినిమా గుర్తొస్తుంది.కానీ దానికి దీనికి అసలు సంబందం లేదు.
స్వల్ప వ్యవధిలోనే ఈ వెబ్ సిరీస్, ఆ సినిమా రెండు కూడా రిలీజ్ అవ్వడం విశేషమనే చెప్పాలి. అయితే రాంగోపాల్ వర్మ తీసిన సినిమా వ్యూహం ఈనెల 29వ తేదీన థియేటర్లలోకి రాగా ఈ వ్యూహం మాత్రం ఈలోపే ఓటిటి లోకి వచ్చేసిందని చెప్పాలి. అయితే ఈ సీరీస్ పరిస్థితి ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ లో తెలుసుకుందాం…
ముందుగా ఈ సిరీస్ కథలోకి వెళ్తే…
మైఖేల్ (చైతన్య కృష్ణ) ప్రెగ్నెంట్ గా ఉన్న తన భార్య జెస్సికా (పావని గంగిరెడ్డి)ను హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు ఒక క్యాబ్ ను బుక్ చేస్తాడు. ఇక అందులో భాగంగానే ఆ క్యాబ్ బుక్ అవుతూ ఉండడం క్యాన్సల్ అవుతూ ఉండడం జరుగుతుంది. ఇక ఈ క్రమంలో క్యాబ్ ను నమ్ముకుంటే పని జరగదని తనే స్వయంగా బైక్ తీసుకొని తన భార్యని హాస్పిటల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా చాలా బైకులు ఆయనకి రోడ్ మీద అడ్డుగా వస్తూ ఉంటాయి అయితే వాటిని తప్పిస్తూ తను నిదానంగా వెళుతుండగా ఒక కారు వచ్చి ఆ బైకుని ఢీకొనడంతో మైఖేల్ భార్యకి గర్భ స్రావం అవుతుంది అలాగే తను గతాన్ని మర్చిపోతుంది. అయితే యాక్సిడెంట్ కేస్ ని ఎసిపి అర్జున్ రామచంద్ర (సాయి సుశాంత్ రెడ్డి) డీల్ చేస్తాడు. అయితే రోడ్డుపైన మైకేల్ పైకి అడ్డొచ్చిన బైకులకి, వీళ్ళకి యాక్సిడెంట్ చేసిన కార్ కి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టుగా తను అనుమానిస్తూ ఇన్వెస్టిగేషన్ ని మొదలు పెడతాడు. ఇక ఇదే క్రమంలో వ్యాపారాల పేరుతో సెటిల్మెంట్లు చేసే రెడ్డన్న కుమార్తె అయిన నిహారిక ( ప్రీతి ఆశ్రాని ) కిడ్నాప్ కి గురవుతుంది.
అంతలో ఏసిపి కి యాక్సిడెంట్ చేసిన వ్యక్తులకు, నిహారిక ను కిడ్నాప్ చేసిన వ్యక్తులకు మధ్య సంబంధం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో అతనికి కళ్ళు చెదిరిపోయే నిజాలు తెలుస్తూ ఉంటాయి. అయితే మొత్తానికి ఏసిపి తను అనుకున్నట్టుగా ఇది ప్లాన్ ప్రకారం జరిగిందా లేదా అనుకోకుండా జరిగిందా అనే విషయాలను తెలుసుకున్నాడా లేదా ఒక ప్లాన్ ప్రకారం జరిగితే వాళ్ళందరిని పట్టుకున్నాడా లేదా అనే ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ సీరీస్ సాగుతుంది. ఇక ఈ క్రమంలో ఈ సిరీస్ లో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ని చూడాల్సిందే…
ఇక ఈ సిరీస్ కి సంబంధించిన విశ్లేషణను ఒకసారి తెలుసుకుంటే 8 ఎపిసోడ్ లుగా వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను ప్రతి ఎపిసోడ్ లో సస్పెన్స్ కి గురి చేస్తూ అధ్యంతం ఒక ట్రాక్ లోకి తీసుకువెళ్తుంది. అలాగే దర్శకుడు శశికాంత్ ఎంచుకున్న పాయింట్ టేక్ ఆఫ్ చేసిన విధానం కూడా కొంతవరకు పర్లేదు అనిపించేట్టుగా సాగుతుంది. ఇదే క్రమంలో మొదటి నాలుగు ఎపిసోడ్ల వరుకు ప్రేక్షకులకు బాగా క్లిక్ ఇచ్చే విధంగా ఈ సిరీస్ అనేది సాగుతుంది. మొదటి ఎపిసోడ్స్ లో క్యారెక్టర్స్ బిల్ చేస్తూ డైరెక్టర్ ఆ క్యారెక్టర్ల తాలూకు ఒక ఎమోషన్ ని ప్రేక్షకుడికి హుక్ చేస్తూ మిగతా అన్ని ఎపిసోడ్లు చూడాలి అనేంత విధంగా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తూ సిరీస్ ని నడిపించాడు. అయితే డైరెక్టర్ ఈ కాన్సెప్ట్ ని ఏ ఉద్దేశ్యం తో అయితే తీసుకున్నాడో దాన్ని కొంచెం కూడా మిస్ అవ్వకుండా ఆ ఎమోషన్ ని చివరి వరకు కంటిన్యూ చేస్తూ తీసుకొచ్చాడు.అలాగే ట్విస్ట్ లను కూడా అద్భుతంగా రాసుకున్నాడు. అలాగే దాన్ని రివిల్ చేసే స్క్రీన్ ప్లే ని కూడా పర్ఫెక్ట్ పాటర్న్ లోకి తీసుకెళ్లి ఓపెన్ చేసాడు… అయితే ఈ సిరీస్ లో దర్శకుడు వంతుగా ఆయన తన బాధ్యతను దర్శకుడు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినప్పటికీ కొన్ని సీన్లలో మాత్రం లాగ్ అయింది దాంతో అక్కడక్కడ ప్రేక్షకుడు చిన్న పాటి డిసప్పాయింట్మెంట్ కి గురవుతూ ఉంటాడు. ఎందుకంటే కొన్ని సీన్లలో ఒక సీన్ లో ఉన్న ఫ్రెష్ నెస్ మరొక సీన్ లో కనిపించకపోవడంతో ప్రేక్షకులు సీరీస్ నుంచి డివియెట్ అయ్యే అవకాశం అయితే ఉంది…
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే..
సాయి సుశాంత్ రెడ్డి, చైతన్య కృష్ణ, పావని గంగిరెడ్డి లాంటి మెయిన్ లీడ్ ని పోషించిన క్యారెక్టర్లు అందరూ కూడా తమ పర్ఫామెన్స్ ని పర్ఫెక్ట్ గా పొట్రే చేశారు. చైతన్య కృష్ణ అయితే తన క్యారెక్టర్ లో ఉన్న షేడ్స్ ని కంప్లీట్ గా మారుస్తూ ఒక అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇచ్చాడు ఇప్పటివరకు ఆయన చేసిన క్యారెక్టర్లన్నింటిలో కూడా ఇదొక డిఫరెంట్ అటెంప్ట్ అనే చెప్పాలి. ఇక మిగతా క్యారెక్టర్లు చేసిన వాళ్ళు కూడా తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
ఇక టెక్నికల్ విషయానికి వస్తే శ్రీరామ్ మద్దూరి ఇచ్చిన మ్యూజిక్ కొంతవరకు పర్లేదు అనిపించేలా ఉంది. అక్కడక్కడ కొన్ని సీన్లను ఎలివేట్ చేయడంలో కొంతవరకు ప్లస్ అయింది. కే సిద్ధార్థ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయిందనే చెప్పాలి. కొన్ని షాట్స్ లో ఒక సీన్ ని దర్శకుడు ఎలాగైతే రాసుకున్నాడో దాని పర్ఫెక్ట్ గా స్క్రీన్ పైన చూపించడానికి సినిమాటోగ్రాఫర్ చాలా హెల్ప్ చేశాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషన్ సీన్స్ ని తెరకెక్కించడంలో దర్శకుడు సినిమాటోగ్రాఫర్ ఇద్దరు కూడా చాలా కష్టపడ్డట్టుగా తెర పైన కనిపిస్తుంది…
ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే
కథ
డైరెక్షన్
ట్విస్టులు
సినిమాటోగ్రాఫర్
సినిమాలోని మైనస్ పాయింట్స్ ఏంటంటే
సిరీస్ నాలుగు ఎపిసోడ్లను మినహాయిస్తే మిగిలిన ఎపిసోడ్స్ అన్నీ కూడా లాగ్ అయ్యాయి…
కొన్ని సీన్స్ లలో బ్యాగ్రౌండ్ స్కోర్ కరెక్ట్ గా ఉన్నట్టయితే ఆ సీన్లు కూడా బాగా ఎలివేట్ అయ్యేవి…
కొన్ని క్యారెక్టర్లు చేసిన ఆర్టిస్ట్ లు వాళ్ళ పాత్రలకు సరిగ్గా సరిపోలేదు అన్నట్టుగా అనిపిస్తుంది…
ఇక సిరీస్ కి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5