https://oktelugu.com/

హర్ష కాబోయే భార్య ఎవరో తెలుసా? నాలుగేళ్లు డేటింగ్ అట !

టాలీవుడ్ లో మొత్తానికి పెళ్లిల సీజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఏడాది కొంతమంది హీరోలు పెళ్లి చేసుకోగా.. ఈ ఏడాది కూడా పెళ్లిళ్లు ఇంకా చాలానే జరగనున్నట్లు తెలుస్తోంది. మొన్న సింగర్ సునీత రెండో పెళ్లితో సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టగా తాజాగా కమెడియన్ హర్ష కూడా పెళ్లి వార్తతో వైరల్ అయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైవా హర్ష ఒక ఇంటివాడు కాబోతున్నాడని.. ఇప్పటికే అతని ఎంగేజ్మెంట్ కూడా పూర్తయ్యిందని.. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారని […]

Written By:
  • admin
  • , Updated On : January 12, 2021 / 11:17 AM IST
    Follow us on


    టాలీవుడ్ లో మొత్తానికి పెళ్లిల సీజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఏడాది కొంతమంది హీరోలు పెళ్లి చేసుకోగా.. ఈ ఏడాది కూడా పెళ్లిళ్లు ఇంకా చాలానే జరగనున్నట్లు తెలుస్తోంది. మొన్న సింగర్ సునీత రెండో పెళ్లితో సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టగా తాజాగా కమెడియన్ హర్ష కూడా పెళ్లి వార్తతో వైరల్ అయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైవా హర్ష ఒక ఇంటివాడు కాబోతున్నాడని.. ఇప్పటికే అతని ఎంగేజ్మెంట్ కూడా పూర్తయ్యిందని.. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారని ఇలా రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

    Also Read: మొదటి రోజు అద్భుతం.. రేపు కలుద్దాం !

    మెయిన్ మ్యాటర్ లోకి వెళ్తే.. వైవా హర్ష, అక్షర అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు ఈ జంట. పైగా ఈ వేడుకకు సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు. ఇంతకీ హాజరు అయినా ఆ ప్రముఖులు ఎవరంటే.. సాయి ధరమ్ తేజ్, అలాగే మెగా డాటర్ సుస్మిత కూడా నిశ్చితార్థం వేడుకలో పాల్గొన్నారు. ఆమె భర్త విష్ణు ప్రసాద్ కూడా ఈ వేడుకకు వచ్చినట్లు తెలుస్తోంది. వారు కొత్తగా ప్రొడ్యూస్ చేస్తున్న వెబ్ సిరీస్ లో హర్ష నటిస్తున్నాడు కాబట్టే.. వారు వచ్చారు అనుకోవలేమో. ఇక ఎప్పుడు నవ్వుతూ అందరిని నవ్వించే హర్షతో చాలమంది సన్నిహితంగానే ఉంటారు కాబట్టి.. మిగిలిన కమెడియన్స్ అండ్ చిన్న హీరోలు కూడా ఈ వేడుకకు వచ్చారు. వారిలో సందీప్ కిషన్, సుధీర్ బాబు లాంటి హీరోలు ఉన్నారట.

    Also Read: అల్లుడు అదుర్స్ కి డైరక్టర్ అనిల్ రావిపూడి గైడెన్స్ !

    అయితే, వైవా హ‌ర్ష‌ది ప్రేమ వివాహ‌మట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా ఇంట‌ర్వ్యూలో చెబుతూ.. త‌న ల‌వ్‌స్టోరీని చెప్పుకొచ్చాడు. అక్ష‌ర‌నే త‌న‌కు ముందు ప్ర‌పోజ్ చేసింద‌ని.. వెంట‌నే నేను ఒప్పుకున్నానని.. నాలుగు సంవ‌త్స‌రాల పాటు మేమిద్ద‌రం డేటింగ్ చేశాము అని.. త్వ‌ర‌లో తాను జీవిత భాగ‌స్వామి కాబోతుంది అని వైవా హ‌ర్ష చెప్పుకొచ్చాడు. ఇక గ‌త ఏడాదిలో ఓటీటీలో విడుద‌లైన సుహాస్ క‌ల‌ర్ ఫొటోలో వైవా హ‌ర్ష కీల‌క పాత్ర‌లో నటించాడు. హ‌ర్ష‌కు వ‌రుస ఆఫ‌ర్లు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఆహాలో ఓ టాక్ షోకు వ్యాఖ్య‌త‌గా కూడా హర్ష వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్