Homeఎంటర్టైన్మెంట్K Vishwanath : విశ్వనాథ్, చంద్రమోహన్, బాలసుబ్రహ్మణ్యం వరుసకు సోదరులే.. కానీ ట్విస్ట్ ఇదే

K Vishwanath : విశ్వనాథ్, చంద్రమోహన్, బాలసుబ్రహ్మణ్యం వరుసకు సోదరులే.. కానీ ట్విస్ట్ ఇదే

K Vishwanath : బాలసుబ్రమణ్యం మధురమైన గాయకుడు.. కే విశ్వనాథ్ కళా ఖండాలు తీసిన దర్శకుడు.. చంద్రమోహన్ అద్భుతంగా నటించగల నటుడు.. వీరంతా తెలుగు చిత్ర పరిశ్రమను ఒకప్పుడు ఏలిన వాళ్లే.. కానీ వీరు వరసకు సోదరులవుతారు.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎరగని ముద్ర వేసిన విశ్వనాథ్ కు నటుడు చంద్రమోహన్, అలాగే గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం బంధువులవుతారు..

నిజానికి విశ్వనాధ్ కు పరిశ్రమకు రావాలనే ఆసక్తి ఉండేది కాదు. అయితే ఆయన తండ్రి వాహిని స్టూడియోలో పనిచేస్తూ ఉండటం వల్ల ఆయన మాట కాదనలేక సౌండ్ రికార్డింగ్ అసిస్టెంట్ గా చేరారు. పని అయినా నిబద్ధతతో చేసే విశ్వనాధ్ ఆదెట్టి సుబ్బారావు కంట్లో పడటం, అలా దర్శకత్వ విభాగంలోకి రావటం చకచకా జరిగిపోయాయి.. అనతి కాలంలోనే డైరెక్టర్ గా ఆత్మగౌరవం సినిమాను నాగేశ్వరరావు తో తీయడం జరిగిపోయింది.. ఇక విశ్వనాధ్ తండ్రికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య చెల్లెలి కొడుకు చంద్రమోహన్. అలా విశ్వనాథ్, చంద్రమోహన్ వరుసకు సోదరులవుతారు. ఇక చంద్రమోహన్ బావమరిది చెల్లిని బాలసుబ్రమణ్యం అన్న పెళ్లి చేసుకోవడం వల్ల వారిద్దరూ కూడా బంధువులయ్యారు.

ఇండస్ట్రీలో స్థిరపడ్డాకే ఈ ముగ్గురికి తాము బంధువులమని తెలిసింది.. వీరి కుటుంబాలు వేరు వేరు చోట్ల స్థిరపడటం వల్ల వారు బంధువులనే విషయం తెలియదట. ప్రతి ఇంట్లోనూ అభిప్రాయ బేధాలు మామూలే. అలానే వీరి ముగ్గురికి కూడా అప్పుడప్పుడు అభిప్రాయ బేధాలు వచ్చినా కలిసి ఉండేవారు. చంద్రమోహన్, విశ్వనాథ్ చెన్నైలో పక్కపక్కనే ఇళ్ళు కట్టుకొని సెటిల్ అయ్యారు. ఇలా ముగ్గురు సినిమా ఇండస్ట్రీలోకి తెలియకుండా వచ్చిన అన్నదమ్ములు పరిశ్రమను ఏలారు. ఆ మధ్య బాలసుబ్రమణ్యం కన్నుమూసినప్పుడు అతన్ని తలుచుకుంటూ విశ్వనాధ్ కంటనీరు పెట్టుకున్నారు.. సిరివెన్నెల, బాలసుబ్రహ్మణ్యం నాకు రెండు కళ్ళలాంటివారని.. ఇద్దరూ కన్నుమూశాక అంధుడిని అయిపోయానని కన్నీటి పర్యంతమయ్యారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular