Laila
Laila : తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులకు కొత్త రకమైన స్టోరీలను పరిచయం చేస్తూ సరికొత్త థియేట్రికల్ అనుభూతిని కలిగించాలని తపన పడే హీరోలలో ఒకడు విశ్వక్ సేన్(Vishwak Sen). యూత్ ఆడియన్స్ లో ఈయనకంటూ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. అయితే ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం తర్వాత విశ్వక్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ‘గామీ'(Gaami Movie) చిత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది కానీ, ఆ తర్వాత విడుదలైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘మెకానిక్ రాకీ’ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఆయన ‘లైలా'(Laila Movie) చిత్రంతో ఈ నెల 14 న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో విశ్వక్ సేన్ లేడీ గెటప్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, థియేట్రికల్ ట్రైలర్ కి మాత్రం మిక్సెడ్ రెస్పాన్స్ వచ్చింది.
అడల్ట్ రేటెడ్ జోక్స్ ని యూత్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ పొరపాటున ఈ సినిమా ట్రైలర్ ని చూస్తే అడ్డమైన బూతులు తిట్టొచ్చు. మా టార్గెట్ కూడా కేవలం యూత్ ఆడియన్స్ అని, వాళ్ళ కోసమే ఈ సినిమాని తీశామంటూ విశ్వక్ సేన్ ప్రొమోషన్స్ లో తెలిపాడు. కానీ విడుదల తర్వాత ఈ చిత్రం ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ని ఇటీవలే పలువురు సినీ ప్రముఖులు, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేశారట. వాళ్ళ నుండి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ మాత్రం పొట్ట చెక్కలయ్యే రేంజ్ కామెడీ ఉందని, కాకపోతే సినిమాని సినిమా లాగా చూసే వారికి, లాజిక్స్ వేటకని వారికి ఈ సినిమా మంచి టైం పాస్ ఎంటర్టైనర్ అవుతుందని అంటున్నారు.
సోషల్ మీడియా నుండి ఈ చిత్రానికి సాధ్యమైనంత వరకు నెగటివ్ టాక్ వచ్చే సూచనలు ఉన్నాయి కానీ, పబ్లిక్ టాక్ మాత్రం పాజిటివ్ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుంది అనేది మరో రెండు రోజుల్లో తెలియనుంది. ఇప్పటికే కమెడియన్ పృథ్వీ రాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పొలిటికల్ కామెంట్స్ చేసి ఈ చిత్రం పై ఘోరమైన నెగటివిటీ పెంచాడు. హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు ప్రెస్ మీట్ పెట్టి మా సినిమాని చంపేయొద్దు అంటూ వేడుకున్న సంగతి తెలిసిందే. బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ వైసీపీ అభిమానుల ఆవేశం తగ్గడం లేదు. మీ క్షమాపణలు మాకు అవసరం లేదు పృథ్వీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కానీ పృథ్వీ మాత్రం అసలు పట్టించుకోవడం లేదు, చివరికి ఏమవ్వుద్దో చూడాలి.