Vishwak Sen Legacy Teaser: ‘మెకానిక్ రాకీ’, ‘లైలా’ వంటి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత హీరో విశ్వక్ సేన్(Viswak Sen) తన కెరీర్ పట్ల చాలా జాగ్రత్తపడ్డాడు. తన స్క్రిప్ట్ సెలక్షన్ ప్రక్రియ లో జరుగుతున్న లోపాలను గుర్తించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ని ఇచ్చే సినిమాలను అందించేందుకు కృషి చేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే అనుదీప్ KV తో ‘ఫంకీ’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా పై మార్కెట్ లో మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రం తో పాటు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఆయన ‘లేజసీ’ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. నేడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. విశ్వక్ సేన్ మార్క్ హీరోయిజం తో ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఉండబోతుంది అని తెలుస్తోంది.
రాజకీయమంటే పులి మీద సవారి లాంటిది అంటారు, మరి ఆ పులి మీద ఆ నాయకుడు ఒక్కడే కూర్చోవాలా?, లేదా ఆ కుటుంబం మొత్తం కూర్చోవాలా?, పులితో చంపేస్తారు కదా?, మరి తన కుటుంబం, తన లేజసీ ఏమైపోవాలి ? అనే డైలాగ్ తో ఈ టీజర్ మొదలు అవుతుంది. ఒక తండ్రిని క్షమించలేని కొడుకు, పవర్ గేమ్ లో తన కుటుంబాన్ని కూడా వాడుకునే తండ్రి అనే డైలాగ్ ని బట్టీ చూస్తే, రాజకీయాలు తండ్రి కొడుకులను భద్ర శత్రువులుగా మార్చాయి అనేది అర్థం అవుతోంది. రాజకీయాల్లో లేజసీ కోసం తండ్రి కొడుకుల మధ్య పోరాటం అనేది కొత్త కాదు, రియాలిటీ లో మనం చాలానే చూస్తూ పెరిగాం. అలా రియాలిటీ లో జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకొనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. టీజర్ చివర్లో విశ్వక్ సేన్ తన తండ్రి సమాధి పై ఉచ్చ పోయడం తన మార్క్ హీరోయిజం ని చూపించింది.
తండ్రి సమాధి మీద ఉచ్చ పోసేంత శత్రుత్వం వీళ్ళ మధ్య ఎలా వచ్చింది ?, రియాలిటీ లో జరిగే పాలిటిక్స్ లో తండ్రి కొడుకుల మధ్య ఎన్ని ద్వేషాలు రాజకీయ పరంగా ఉన్నా, దాన్ని బయటపెట్టరు, పైకి నటిస్తారు. కానీ ఇక్కడ తన స్టాఫ్ ముందే హీరో తన తండ్రి సమాధి పై ఇలాంటి పని చేసాడంటే, వీళ్లిద్దరి మధ్య ఏ రేంజ్ గొడవలు జరిగి ఉంటాయో మీరే ఊహించుకోండి అని డైరెక్టర్ హిట్ ఇచ్చేసాడు. ఈ చిత్రానికి సాయి కిరణ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. గతం లో ఈయన పిండం అనే హారర్ చిత్రాన్ని తెరకెక్కించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా పేలలేదు కానీ, ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియా ని ఊపేస్తున్న ‘లేజసీ’ టీజర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
Vishwak Sen’s #Legacy Politics!! pic.twitter.com/f5Lb8jn691
— Aakashavaani (@TheAakashavaani) January 1, 2026