Vishvak Sen : సినిమా ఇండస్ట్రీ లో రాణించాలంటే కచ్చితంగా అదృష్టం ఉండాల్సిందే. ముఖ్యంగా నిర్మాత లేనిదే సినిమా లేదు. అలాంటి నిర్మాత ఇండస్ట్రీ లో కేవలం 20 శాతం సక్సెస్ ని మాత్రమే చూస్తున్నాడు. అయినప్పటికీ సినిమాల మీద ఇష్టంతో కోట్ల రూపాయిల బుడ్జెట్స్ ని పెట్టి సినిమాలు తీస్తూనే ఉన్నారు. కొంత మంది దర్శకులను అయితే కేవలం స్టోరీ లైన్ విని, డైరెక్టర్ మీద, హీరో మీద గుడ్డిగా నమ్మకం పెట్టి సినిమాలు చేస్తుంటారు. కొంతమంది అయితే నిర్మాత పెట్టుకున్న నమ్మకానికి నూటికి నూరు శాతం కష్టపడి పని చేసి ‘ది బెస్ట్’ ఔట్పుట్ ఇవ్వడానికి కష్టపడితే, మరికొంతమంది మాత్రం ఇష్టమొచ్చినట్టు సినిమాలు తీసి జనాల మీదకు వదిలేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ చీత్కారాలను అందుకొని పెట్టిన బడ్జెట్ లో కనీసం పావు శాతం రికవరీ ని కూడా పొందలేక తీవ్రమైన నష్టాలను చూస్తుంటారు. ఇప్పుడు లైలా(Laila Movie) చిత్రానికి నిర్మాత సాహు గరిపాటి అలాంటి నష్టాలనే చూసాడు.
ఈ చిత్రానికి ముందు ఆయన ‘భగవంత్ కేసరి'(Bhagavanth Kesari), ‘మజిలీ’, ‘ఉగ్రం’, ‘టక్ జగదీశ్’ వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించాడు. సాహు గరిపాటి(Sahu Garipati|) నిర్మాణ సంస్థ నుండి ఒక సినిమా వస్తుందంటే, కచ్చితంగా ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అని ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఇప్పుడు ‘లైలా’ చిత్రం కారణంగా ఆ బ్రాండ్ ఇమేజి కి మసకబారింది. అన్ని సూపర్ హిట్ సినిమాలు తీయలేరు, కొన్ని చిత్రాలు ఫ్లాప్స్ అవుతుంటాయి. కానీ ఈ సినిమా విషయంలో ఏమి జరిగిందంటే, ఇంత చెత్త సినిమాని జీవితంలో ఎప్పుడూ చూడలేదు అనే రేంజ్ లో టాక్ ని తెచ్చుకుంది. ఇందులో హీరో గా నటించిన విశ్వక్ సేన్ కి, డైరెక్టర్ కి చివాట్లు పడ్డాయి. అంతే కాకుండా ఇలాంటి చెత్త సినిమా కోసం కోట్ల రూపాయిలు ఖర్చు చేసిన సాహు గరిపాటి పై జాలీ చూపించాలో, లేదా తిట్టాలో అర్థం అవ్వని పరిస్థితి.
ఈ చిత్రం తర్వాత సాహు గరిపాటి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి కచ్చితంగా భారీ బడ్జెట్ అవసరం అవుతుంది. చిరంజీవి లాంటి స్టార్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి సాహు గరిపాటి కి ఫైనాన్షియర్స్ బాగా దొరుకుతారు. చిరంజీవి తో కాకుండా విశ్వక్ సేన్(Vishwak Sen) రేంజ్ హీరోలతో వెంటనే సినిమా చేసుంటే మాత్రం ఆయనకు ఫైనాన్స్ దొరకడం చాలా కష్టం అయ్యేది. ఈ లైలా ఇచ్చిన స్ట్రోక్ నుండి సాహు ఎంత తొందరగా కోలుకొని కం బ్యాక్ అవుతాడో చూడాలి. ఇకపోతే విశ్వక్ సేన్ కూడా ఈ సినిమా ఫ్లాప్ తర్వాత బాగా అలెర్ట్ అయ్యాడు. వరుసగా క్రేజీ యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు ఒప్పుకుంటూ ఫుల్ బిజీ గా మారిపోయాడు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఆయన కెరీర్ ఎలా మలుపు తీసుకుంటుంది అనేది.