Matti Kusthi Trailer: ప్రతి ఒక్కరికి పెళ్లికి ముందు.. పెళ్లి తరువాత రెండు జీవితాలు ఉంటాయి. పెళ్లికి ముందే ఎలాగోలా లైఫ్ జాలీగా గడచిపోతుంది. కానీ పెళ్లి తర్వాత అసలు కథ మొదలవుతుంది.. ఈ కాన్సెప్ట్ తో అనేక సినిమాలు వచ్చాయి. ఇదే నేపథ్యంలో ఆకట్టుకునే మలుపు కథతో రాబోతుంది ‘మట్టి కుస్తీ’. ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో కొన్ని డైలాగ్స్ పేలిపోతున్నాయి. విష్ణు విశాల్ హీరోగా నటించడంతో పాటు ఈ మూవీని స్వయంగా నిర్మిస్తున్నారు. ఆయనకు తోడుగా మాస్ మహరాజ్ రవితేజ నిర్మాణంలో భాగస్వాముడయ్యాడు. మాస్ సీన్స్ ను ప్రేక్షకులకు వండి పెట్టే రవితేజ తన నిర్మాణంలో వస్తున్న ఈ మూవీ కూడా భారీ యాక్షన్ తో కూడుకోవడం తో ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

తన ఊర్లో జాలీగా తిరిగే విష్ణు విశాల్ పద్దతైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. తన మేనమామను అలాంటి అమ్మాయిని చూడమంటాడు. కానీ అందుకు విరుద్ధమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత పెళ్లి జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కున్నాడనేది సినిమా స్టోరీ. ఈ క్రమంలో విష్ణు విశాల్ కు కుటుంబంతో పాటు కుస్తీ పోటీలో గెలిచే బాధ్యత ఉంటుంది. దీంతో రెండిట్లో ఎలా విజయం సాధించాడనే కథతో సాగుతున్న తీరు ఆద్యంతం ఆకట్టుకోనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
విష్ణు విశాల్ ఇప్పటికే ‘ఎఫ్ఐఆర్’ అనే మూవీతో ఆకట్టుకున్నాడు. తన రెండో సినిమా కూడా కచ్చితంగా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాడు. మాస్ యాక్షన్ లో ఏమాత్రం తీసిపోని విధంగా విధంగా ఆకట్టుకున్నాడు. ఇందులో యాక్షన్ తో పాటు వేడెక్కించే రొమాన్స్ లోకూడా కనిపించాడు. అటు హీరోయిన్ ఐశ్వర్య కూడా తనదైన నటనలో కనిపిస్తోంది. వీరి పెళ్లి జీవితంలో ఎదురైన సంఘటనల్లో భాగంగా పంచ్ డైలాగ్స్ విపరీతంగా పేలుతున్నాయి. ఇందులో ‘మొగుడు తో సంసారమంటే కుస్తీ పట్టాలి.. మరి తప్పదు..’ అనే డైలాగ్ ప్రేక్షకుల్లోకి వెళ్తోంది.

మట్టి కుస్తీ డిసెంబర్ 2 ను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. చెల్లా అయ్యావ్ ఈ సినిమాకు డైరెక్టర్. డియర్ కామ్రేడ్, రాధేశ్యామ్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు కూడా బాణీలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫన్, యాక్షన్, రొమాన్స్ కలయికలో ఉండే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని చిత్రం యూనిట్ భావిస్తోంది.
