Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందే ఈ సీజన్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ విష్ణు ప్రియ. బయట ఆమె చేసిన షోస్ ద్వారా ఏళ్ళ నుండి ఆమెని అమితంగా ఇష్టపడే ఆడియన్స్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఈమె హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు ఈ సీజన్ మొట్టమొదటి లేడీ విన్నర్ అని కూడా అందరూ అనుకున్నారు. ఎందుకంటే నామినేషన్స్ లోకి ఈమె మొదటి వారం వచ్చినప్పుడు సోషల్ మీడియా పోల్స్ లో ఈమెకు వచ్చిన ఓటింగ్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నెంబర్ 1 స్థానంలో నిఖిల్ కంటే భారీ మార్జిన్ తో కొనసాగింది. కానీ ఎందుకో ఆమె మొదటి రెండు వారాల్లో చూపించిన ఉత్సాహం, తదుపరి వారాల్లో చూపించలేకపోయింది. విష్ణు ప్రియ కి గేమ్స్ ఆడేందుకు అవకాశం వచ్చినప్పుడు అద్భుతంగా ఆడేది. కానీ ఆమెకి గేమ్స్ ఎక్కువగా ఆడే అవకాశం బిగ్ బాస్ కల్పించలేదు అనే భావం ఆమె అభిమానుల్లో ఉంది.
అంతే కాకుండా విష్ణు ఎలిమినేట్ అవ్వడానికి మరో ముఖ్య కారణం ఏమిటంటే, మిగతా కంటెస్టెంట్స్ లాగా ఆమెలో గెలవాలి అనే తపన ఉండకపోవడం. ఎదో సరదాగా గడపడానికి ఇక్కడికి వచ్చాను. నేను నాలాగా ఉంటాను, జనాలు నా ప్రవర్తన నచ్చితే ఉంచుతారు, నచ్చకపోతే పంపేస్తారు అంతే, అనే ధోరణిలో ఆమె కొనసాగింది. కానీ జనాలు ఆమె అలా నిజాయితీగా ఉండడమే ఇష్టపడ్డారు. హౌస్ లో ఉన్నప్పుడు ఆమె పృథ్వీ అనే అబ్బాయిని ఇష్టపడింది. చాలా మంది అమ్మాయిలు కేవలం కంటెంట్ కోసం మాత్రమే ఇలాంటి లవ్ ట్రాక్స్ నడుపుతూ ఉంటారు. కానీ విష్ణు ప్రియ మాత్రం అలా కాదు, నిజాయితిగా అతన్ని ఇష్టపడింది, నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నన్ను వదిలేయ్ అని చెప్పినా కూడా అతని వెంటనే తిరిగింది. హౌస్ లోకి వచ్చిన ఆమె తండ్రి నువ్వు నీకోసం మాత్రమే గేమ్ ఆడుకో అని చెప్పాడు.
కానీ విష్ణు ప్రియ వినలేదు, అదే విధంగా విష్ణు స్నేహితులు, ఆమె చెల్లి కూడా అదే చెప్పింది, అయినా కానీ ఆమె పట్టించుకోలేదు. తాను ఎప్పుడు ఎలా ఉన్నిందో, అలాగే ఉంటూ వచ్చింది. కానీ ఎప్పుడైతే శ్రీముఖి హౌస్ లోకి వచ్చి, విష్ణు ప్రియ కి నీ వల్ల పృథ్వీ గేమ్ బాగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పిందో, ఆ వారంలో ఆమె పృథ్వీ తో ఎక్కువ తిరగడం ఆపేసింది. అలా ఆమె ఆపేసిన వారంలోనే పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు. ఇదంతా పక్కన పెడితే విష్ణు ప్రియ కి బిగ్ బాస్ టీం ఇచ్చిన రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుండి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న కంటెస్టెంట్ కావడంతో ఈమెకు వారానికి 3 లక్షల 50 వేల రూపాయిలు ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం ఒప్పందం చేసుకుంది. 14 వారాలు ఆమె బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది, ఈ 14 వారాలకు ఆమె 49 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుందని సోషల్ మీడియా లో ఒక టాక్ వినిపిస్తుంది.