Vishnupriya: బుల్లితెర మీద తనదైన యాంకరింగ్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న విష్ణు ప్రియ ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో యూట్యూబ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షోలో సందడి చేసింది. ఇక ఆ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. అలాగే కొన్ని ప్రైవేట్ సాంగ్స్ లో కూడా నటించింది ఆ సాంగ్స్ లలో మాస్ స్టెప్పులు వేస్తూ కుర్రకారు మతులు పోగొట్టింది..
ఇక ఇదిలా ఉంటే విష్ణు ప్రియ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఏదైనా కొత్త సినిమా వస్తే చాలు దానికి సంబంధించిన పాటలు డాన్సులు వేస్తూ సోషల్ మీడియా వేదిక తన అభిమానులతో పంచుకుంటుంది. ఇప్పుడు కూడా గాలోడు సినిమాకు సంబంధించిన ఒక పాటలో ఆడిపాడింది…దాంతో ఆమె వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు విష్ణుప్రియ వేసిన స్టెప్పులకి మతులు పోతున్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే విష్ణు ప్రియ ఏం చేసిన అలా ఉంటుంది, విష్ణు ప్రియ అంటే మామూలుగా ఉండదు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈమె వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉన్నా కూడా ఈమెకు సినిమాల్లో అవకాశాలు అయితే రావడం లేదు.ఒకవేళ సినిమాల్లో అవకాశాలు వచ్చిన కూడా అవి పెద్దగా ఉపయోగం లేని క్యారెక్టర్లు..
దానివల్ల ఆమె ఆ క్యారెక్టర్ లలో చేసిన కూడా ఆమెకు పెద్దగా గుర్తింపు అయితే రావడం లేదు. అలాంటప్పుడు ఆ క్యారెక్టర్లు చేయడం దేనికి అని ఆమె కూడా విసుగు చెందుతున్నట్లు గా తెలుస్తుంది. ఇక మరికొందరైతే ఇలాంటి డ్యాన్సులు వేస్తే సినిమాలో ఛాన్సులు ఎవరు ఇస్తారు మంచి నటనను చూపించే ఒక యాక్టింగ్ వీడియో చేసి సోషల్ మీడియా లో వదిలితే అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి విష్ణు ప్రియ ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ఇదే విషయం మీద ఆమెను ఒక ఇంటర్వ్యూలో అడిగితే నేనెప్పుడూ నా ఆనందాన్ని నా అభిమానులతో పంచుకుంటూ ఉంటాను ఆ క్రమం లోనే నేను సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాను అని సమాధానం చెప్పింది…ఇక దాంతో ఆమె నిజమైన అభిమానులు కూడా ఆమె మీద తమ ఇష్టాన్ని కామెంట్ల రూపం లో తెలియజేస్తూ ఉంటారు…
View this post on Instagram