Virgin Love Story: నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వర్జిన్ స్టోరీ’. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి అట్లూరి ఈ చిత్రంతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం కానున్నారు. గతంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీలో నటించిన విక్రమ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న ‘రౌడీ బాయ్స్’ లోనూ ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడు. కాగా తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజైంది.

ఈ సంధర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల పాల్గొన్నారు. టీజర్ ను రిలీజ్ చేసిన ఆయన… ఇండస్ట్రి లోకి యంగ్ టాలెంట్ వస్తుండడం మంచి విషయం అని అభిప్రాయపడ్డారు. ఈ టీజర్ లో కొన్ని డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. వాటీల్లో హీరో హీరోయిన్ తమను తాము పరిచయం చేసుకుంటూ విరాట్ – అనుష్క, నాగచైతన్య- సమంత అంటూ చెప్పడం ఆకట్టుకుంటుంది. యూత్ ను టార్గెట్ గా చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించినట్లు అర్దం అవుతుంది. విక్రమ్ సహిదేవ్ సరసన సౌమిక పాండియన్ హీరోయిన్ గా నటిస్తుంది. కొత్త హీరోయిన్ అయిన తన నటనతో, గ్లామర్ తో ఆడియన్స్ ను అలరిస్తుంది ఈ భామ. ఈ సంధర్భంగా దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి మాట్లాడుతూ… దర్శకుడు శేఖర్ కమ్ముల గారి సినిమాలు చూసి స్ఫూర్తి పొందుతుంటానని వెల్లడించారు. ‘వర్జిన్ స్టోరీ’ సినిమాను తన జీవితంలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
