Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అటు కెరీర్ పరంగా.. ఇటు బిజినెస్ మేన్ గానూ దూసుకెళ్తున్నారు. తాజాగా.. చెర్రీ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. తమ కంటెంట్ ను తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువ చేసేందుకు సిద్ధమైన హాట్ స్టార్.. చెర్రీని ప్రచారకర్తగా ఎంచుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల స్టార్ మా నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోకు గెస్టుగా హాజరయ్యాడు చెర్రీ.
అయితే.. ఈ సందర్భంగా రామ్ చరణ్ ధరించిన డ్రెస్ అందరినీ ఆకర్షించింది. ఈ విషయాన్ని బిగ్ బాస్ స్టేజ్ మీద ప్రత్యేకంగా ప్రస్తావించిన చెర్రీ.. తాను లోబో డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అయ్యానని చెప్పాడు. దీంతో.. లోబో ఎగిరి గంతేశాడు. లోబో డ్రెస్సింగ్ స్టైల్ లోనే తాను ఈ షోకు వచ్చానని చెప్పి, తాను వేసుకున్న జాకెట్ ఉన అందరికీ చూపించాడు చెర్రీ.
దీంతో.. అందరూ చెర్రీ వేసుకున్న జాకెట్ గురించి, దాని ధర గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఈ జాకెట్ ‘‘డస్ట్ ఆఫ్ గాడ్స్ జోకర్’’ అనే బ్రాండ్ కు సంబంధించినది. డెనిమ్, ఫ్లానెల్ ఫ్యాబ్రిక్ తో ఈ జాకెట్ ను తయారు చేశారు. ఈ జాకెట్ ను గమనిస్తే.. దీనిపై ఒక దెయ్యపు బొమ్మ, పైకి ఉబ్బినట్టుగా కనిపించే దయ్యం చెయ్యి కనిపిస్తాయి. ఇంకా.. పలు రకాల డిజైన్లు కూడా ఉన్నాయి. దీంతోపాటు.. ఓ కొటేషన్ కూడా ఉంది. ‘‘IN DUST WE TRUST, JUST OF FOOD’’ అనే కోట్ ను ప్రింట్ చేశారు.
నిజానికి ‘‘డస్ట్ ఆఫ్ గాడ్స్ జోకర్’’ అనే బ్రాండ్ గురించి సాధారణ జనానికి పెద్దగా పరిచయం ఉండకోవచ్చు. కానీ.. సినీ సెలబ్రిటీలు మాత్రం ఈ బ్రాండ్ ను బాగా ఇష్టపడతారు. ఈ బ్రాండ్‌కు బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. గతంలో షారూక్ వంటి స్టార్లు కూడా వీటిని ధరించారు. ఇప్పుడు రామ్ చరణ్ వేసుకున్నాడు. ఇండియన్ కరెన్సీలో ఈ జాకెట్ ధర 1,50,000 ఉంటుందని తెలుస్తోంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Viral discussion on mega power star ram charan dressing
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com