Vikrant Rona Movie Review :
నటీనటులు: కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రవిశంకర్ గౌడ్
దర్శకుడు: అనూప్ భండారి
నిర్మాతలు: షాలిని జాక్ మంజు, అలంకార్ పాండియన్
సంగీత దర్శకుడు: బి అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ: విలియం డేవిడ్
ఎడిటర్: ఆశిక్ కుసుగొల్లి

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా అనుప్ భండారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘విక్రాంత్ రోణా’. ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి, ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ :
కోమరట్టు అనే గ్రామంలో వరుసగా పిల్లలు చనిపోతూ ఉంటారు. ఆ పిల్లలను చంపుతున్న వ్యక్తి ఎవరు అని విచారణ చేస్తున్న ఆ ఊరు ఇన్ స్పెక్టర్ సడెన్ గా చనిపోతాడు. అతని ప్లేస్ లోకి కొత్త ఇన్ స్పెక్టర్ విక్రాంత్ రోణా (కిచ్చా సుదీప్ ) వస్తాడు. విక్రాంత్ రోణా ఎలా విచారణ చేపట్టాడు ?, అసలు ఆ కోమరట్టు గ్రామంలో భూతాలు ఉన్నాయని జరుగుతున్న పుకారు అబద్దం అని విక్రాంత్ రోణా ఎలా రుజువు చేశాడు ?, ఇంతకీ విక్రాంత్ రోణా ఈ గ్రామానికే ఎందుకు కావాలని వచ్చాడు ?, చివరకు పిల్లలను చంపుతున్న వ్యక్తిని విక్రాంత్ రోణా పట్టుకున్నాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
సినిమాలో విజువల్స్ అండ్ యాక్షన్ బాగున్నా.. స్టోరీ అండ్ ఎమోషన్ మిస్ అయ్యింది. నటీనటుల విషయానికి వస్తే.. సుదీప్ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో ఈ సినిమాకు ఒక సరికొత్త ఎనర్జీ ఇచ్చాడు. అలాగే ఇతర పాత్రల్లో నటించిన నటినటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా విలన్ రోల్ లో కనిపించిన నిరూప్ భండారి తనలోని విలన్ యాంగిల్ ను అద్భుతంగా పండించాడు. అలాగే కామిక్ పాత్రల్లో కనిపించిన కమెడియన్లు తమ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్నిచోట్ల బాగా నవ్వించారు.
కానీ, సినిమా కథనం బాగాలేదు. ఫస్ట్ హాఫ్ లో సుధీప్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే ఎమోషనల్ గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం సినిమా స్థాయికి తగ్గట్టు లేదు. పైగా సింపుల్ పాయింట్ తో సినిమా మొత్తం చుట్టేయడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని ఇంట్రెస్ట్ గా ఎలివేట్ చేయలేకపోవడం, దీనికితోడు ఆడియన్స్ కి మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో మొత్తానికి ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.
ప్లస్ పాయింట్స్ :
సుదీప్ స్క్రీన్ ప్రెజెన్సీ,
టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్,
సాంకేతిక వర్గం పనితీరు.
మైనస్ పాయింట్స్ :
లాజిక్ లెస్ లవ్ డ్రామా,
స్లో నేరేషన్,
స్లోగా సాగే స్క్రీన్ ప్లే,
సినిమాటిక్ టోన్ మరీ ఎక్కువ అవ్వడం,
స్క్రిప్ట్ సింపుల్ గా ఉండటం.
సినిమా చూడాలా ? వద్దా ?
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అలాగే సినిమా మెయిన్ పాయింట్ లో కంటెంట్ బాగుంది. కానీ, మిగిలిన బాగోతం అంతా రొటీన్ అండ్ బోరింగ్ వ్యవహారాలతోనే సాగింది. స్లో నేరేషన్ అండ్ సిల్లీ ప్లేతో ఈ సినిమా అంచాలను అందుకోలేకపోయింది.
రేటింగ్ : 2.5 / 5
Recommended Videos