Thangalaan Movie Review: ‘ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడంలో ‘చియాన్ విక్రమ్’ మొదటి స్థానంలో ఉంటాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఆయన నటనకి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతూ ఉంటాయి. ఇక ఆయన సినిమాల ఫలితం ఎలా ఉన్నా ఆయన నటనలో మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు…
ముఖ్యంగా ఆయన చేసిన ప్రతి ప్రయోగాత్మకమైన సినిమా ప్రేక్షకులకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ను అయితే ఇస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే పా రంజిత్ డైరెక్షన్ లో విక్రమ్ హీరోగా వచ్చిన ‘తంగలాన్ ‘ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది. విక్రమ్ కి చాలా రోజుల తర్వాత ఒక భారీ సక్సెస్ ని అందించిందా పా రంజిత్ కబాలి, కాళీ సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక వీటి తర్వాత తెలుగులో చేసిన ee సినిమాతో సక్సెస్ సాధించాడా లేదా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం…
కథ
ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక తెగకి చెందిన కొంతమంది వ్యక్తులు కర్ణాటకలోని ‘కోలార్ గోల్డ్ ఫిల్డ్స్’ కి సమీపంలో జీవిస్తూ ఉంటారు. ఇక వీళ్ళని బానిసలుగా చేసుకున్న డేనియల్ వీళ్ళ అందరితో గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారాన్ని వెతికించే పనిని చేపడతాడు… మరి తను అనుకున్నట్టుగా అక్కడ బంగారం దొరికిందా? బానిసలుగా చేసుకున్న వీళ్లు అతని మీద తిరుగుబాటు చేసి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారా? లేదా అనే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా అనేది రూపొందింది… ఇక ఫైనల్ గా హీరో తెగల వాళ్ళు ఉన్నారా లేదా అందరిని చంపేశారా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే పా. రంజిత్ ఇంతకుముందు చేసిన చాలా సినిమాలు రియలేస్టిక్ గా ఉండటమే కాకుండా ప్రేక్షకులకు చాలావరకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇక ఆయన చేసిన కబాలి, కాళీ లాంటి రెండు సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయినప్పటికీ దర్శకుడిగా మాత్రం ఆయనకు చాలా మంచి గుర్తింపైతే వచ్చింది…ఇక ఇప్పుడు ఈ సినిమాని కూడా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాడు. ఇక విక్రమ్ లాంటి ఒక నటుడు దొరికితే రంజిత్ తన డైరెక్షన్ ని ఏ రేంజ్ లో ఎలివేట్ చేసుకుంటాడో చెప్పడానికి ఈ సినిమాని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు…
ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా సింపుల్ గా సాగిన ఈ సినిమా ఇంటర్వెల్లో మాత్రం ఒక భారీ ట్విస్ట్ తో ఒక బ్యాంగ్ వస్తుంది. ఇక దర్శకుడు సెకండ్ హాఫ్ మొత్తాన్ని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించే ప్రయత్నం చేశాడు. తను ఎక్కడ కూడా స్టోరీ నుంచి బయటికి వెళ్లకుండా కథ మీద మాత్రమే ఫోకస్ చేసి సినిమాని ముందుకు తీసుకెళ్లాడు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు కొంతవరకు బోర్ కొట్టించినట్టు అనిపించినప్పటికీ అది కథలో భాగం కావడం వల్ల ఆయన కూడా ఏం చేయలేకపోయాడు…
ఇక ప్రీ క్లైమాక్స్ లో చూపించిన ఎమోషన్ సీన్స్ కి ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకుంటారు. అలాంటి ఇక ఎమోషన్ ను పండించడం లో రంజిత్ సక్సెస్ అయ్యాడు…ఇక మొత్తానికైతే జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. కానీ పాటల విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది… ఇక పా.రంజిత్ ఈ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకోవడంలోనే ఆయన టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా రియలేస్టిక్ గా ఎలాంటి సీన్స్ అయితే చేయించాలో అలాంటివి మొత్తం చేయించాడు… ఆర్టిస్టులను వాడుకున్న విధానం కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో చియాన్ విక్రమ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. నిజానికి ఈ సినిమాలో ఆయన నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా కూడా తక్కువ అవుతుందనే చెప్పాలి. ఇక ఇంట్రాడక్షన్ సీన్ లో ఆయన కనిపించిన విధానం సినిమా చూసే ప్రతి ఒక్కరికి గూజ్ బంప్స్ తెప్పిస్తాయనే చెప్పాలి. ఇక ‘పార్వతి తిరువోతు’, ‘మాళవిక మోహన్’ లు కూడా ఈ సినిమాలో తమ బెస్ట్ పర్ఫామెన్స్ ని ఇచ్చారు. వాళ్ల క్యారెక్టర్ లో లీనమైపోయి డైరెక్టర్ ఏం చెబితే అది చేస్తూ ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది అనుకోకుండా ముందుకు సాగారు. అందువల్లే వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా బాగుంది. నిజానికి వాళ్లు పోషించిన పాత్రలు చాలా కష్టంతో కూడుకున్నవి అయినప్పటికీ వాళ్ళు దాన్ని ఇష్టంగా మార్చుకొని చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక విలన్ గా చేసిన ‘డేనియల్ ‘ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆయన విలనిజం సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది…ఇక మిగిలిన నటి నటులు కథలో భాగంగా వచ్చి వెళ్ళిపోయారు…
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ కొంతవరకు సినిమా మీద ఇంపాక్ట్ అయితే తగ్గించిందనే చెప్పాలి. జివి ప్రకాష్ ఇంతకుముందు చేసిన సినిమాల్లో మంచి మ్యూజిక్ ని ఇచ్చేవాడు. కానీ ఈ సినిమాలో తన మ్యూజిక్ మాత్రం అంత మేజర్ పాత్రను పోషించలేదనే చెప్పాలి. ఇక విజువల్స్ అయితే సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా దర్శకుడు ప్రతి షాట్ ని డిఓపి తో డిస్కస్ చేసి మరీ సినిమా చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దర్శకుడు యొక్క వెర్షన్ పూర్తిగా అర్థమైతేనే డిఓపి కూడా తన పూర్తి ఎఫర్ట్ ని ఇవ్వగలుగుతాడు అనేది ఈ సినిమాలో మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక విజువల్స్ అయితే చాలా గ్రాండీయర్ అయితే కనిపిస్తుంది…కొన్ని సీన్లను ఎడిటర్ ఇంకా కొంచెం షార్ప్ ఎడిట్ చేస్తే బాగుండేది…
ప్లస్ పాయింట్స్
కథ
విక్రమ్ యాక్టింగ్
ఎమోషనల్ సీన్స్
డైరెక్షన్
మైనస్ పాయింట్స్
సెకండాఫ్ లో కొన్ని బోరింగ్ సీన్స్…
మ్యూజిక్
రేటింగ్ ఈ సినిమాకి మెమిచ్చే రేటింగ్ 2.75/5
చివరి లైన్
డిఫరెంట్ సినిమా చూడాలి అనుకునేవాళ్లు ఈ సినిమాను చూడవచ్చు…చాలా బాగా ఎంజాయ్ చేస్తారు…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More