Vikram Cobra First Review: ఎల్లప్పుడూ వైవిధ్యమైన పాత్రలను చేస్తూ ప్రేక్షకులను అభిమానులను థ్రిల్ కి గురి చేసే ప్రముఖ హీరో విక్రమ్ చాలా కాలం తర్వాత మన ముందుకు ‘కోబ్రా’ అనే సినిమా తో రాబోతున్నాడు..తమిళం ‘డిమాంటి’ , ‘అంజలి LLB’ వంటి విజయవంతమైన సినిమాలను తీసిన జ్ఞాన ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు..ఇందులో విక్రమ్ ఏకంగా 6 పాత్రలలో నటిస్తున్నాడు..ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ అభిమానులను మరియు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..కథలో కొత్తదనం ఉండడం తో ప్రేక్షకులు కూడా బాగా థ్రిల్ కి గురైయ్యారు..ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా KGF బ్యూటీ శ్రీ నిధి శెట్టి నటించింది..చాలా కాలం తర్వాత థియేటర్స్ లో విడుదల అవ్వబోతున్న విక్రమ్ సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి..ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘మహాన్’ డైరెక్టుగా OTT లో విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాకి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది..ఇక ఆ తర్వాత కరోనా రాయడం..లాక్ డౌన్ పడడం తో ఇంకా ఎక్కువ ఆలస్యం అయిపోయింది..అయితే మొత్తానికి అన్ని అవరోధాలను తొలగించుకొని ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది..ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ఇటీవలే దుబాయి లో ప్రదర్శించారు..అక్కడి నుండి వస్తున్నా రేటింగ్స్ అన్ని కూడా 3.5 కి తక్కువ లేకపోవడం విశేషం..ఈ సినిమాలో విక్రమ్ తన అద్భుతమైన నటన తో మరో సారి అవార్డు విన్నింగ్ పెరఫామెన్స్ ఇచ్చాడని..సినిమాలో ఉన్నటువంటి ట్విస్ట్స్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని చెప్పుకొస్తున్నారు.

విక్రమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది..ఈ సినిమా అందరి లెక్కలు తెలుస్తాడని ఆయన అభిమానులు ఈ రివ్యూస్ ని చూసి బలంగా చెప్తున్నారు..ఈ ఏడాది కమల్ హాసన్ ‘విక్రమ్’ అనే సినిమాతో ఎలాంటి కం బ్యాక్ ఇచ్చాడో మన అందరికి తెలిసిందే..ఇప్పుడు హీరో విక్రమ్ కూడా కోబ్రా సినిమా తో అదే రేంజ్ హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..చూడాలి మరి.
[…] […]
[…] […]