Puri Jagannadh: ఒక సినిమా సక్సెస్ సాధించాలి అంటే కథ అనేది కీలక పాత్ర వహిస్తుంది. ఒక కథను నమ్మే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టడానికి సిద్ధమవుతాడు. ఒక కథను నమ్మే హీరో ఒక సినిమా కి సైన్ చేస్తాడు. అలా సినిమా తీయడానికి అందర్నీ ఉత్తేజపరుస్తూ ముందుకు తీసుకు వచ్చేది ఒక్క కథ మాత్రమే…ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు ఇండస్ట్రీలో రైటర్లకి పెద్దగా వాల్యు ఉండేది కాదు. దాసరి నారాయణరావు, త్రివిక్రమ్ లాంటి రైటర్లు సినిమా స్థాయిని పెంచిన తర్వాత నెమ్మదిగా రైటర్లకి కూడా వాల్యూ పెరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా లో బ్లాక్ బాస్టర్ హిట్స్ ని అందుకుంటున్న రాజమౌళి సినిమాలకి కథలను అందించేది విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) అనే విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈయన ఇండియా లోనే టాప్ రైటర్ గా కొనసాగుతున్నాడు.
ఇక అలాంటి విజయేంద్ర ప్రసాద్ కి ఇష్టమైన రైటర్ ఎవరో తెలుసా మన తెలుగు సినిమా రైటర్, డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్.. అవును మీరు విన్నది నిజమే విజయేంద్ర ప్రసాద్ కి పూరి అంటే చాలా ఇష్టమట. ఇక పూరి అనగానే మనకు ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మాత్రమే గుర్తుకు వస్తాడు. కానీ ఆయనలో ఒక మంచి రైటర్ కూడా ఉన్నాడు. ఆ రైటర్ అంటే విజయేంద్ర ప్రసాద్ చాలా ఇష్టమట. అందుకే ఆయన నేను పూరి అభిమానిని అని ఓపెన్ గా చెబుతూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే పూరి జగన్నాథ్ రైటర్ గా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటో కూడా విజయేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఇక మిగతా రైటర్లకి తనకి మధ్యనున్న తేడా ను కూడా వివరించాడు…
పూరి సినిమాల్లో కథలు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడవు, ఎప్పుడో రాజుల కాలం నాటి కథలను కూడా ఆయన తీసుకోడు… ఆయన తీసుకునే కథలు ఎలా ఉంటాయి అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, తన కెరియర్ లో ఎలాంటి ఇబ్బందులు పడతాడు అనే పాయింట్ మీదనే సినిమా తీస్తూ ఫైనల్ గా హీరోకి ఒక గోల్ పెట్టీ దాన్ని రీచ్ అయ్యే విధంగా తన కథలను రాసుకుంటాడు. అవి చాలా నాచురల్ గా ఉంటాయి. అందుకే ప్రేక్షకులకు తొందరగా కనెక్ట్ అవుతాయి. ఇక ఆయన డైలాగ్స్ గురించి మనం ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఫిలాసఫీకి సంభందించిన డైలాగ్స్ ను పూరి జగన్నాథ్ తన సినిమాల్లో కమర్షియల్ వే లో చాలా బాగా చెప్తూ ఉంటాడు.
అవి కూడా యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అలాగే జీవితానికి సంబంధించిన సత్యాలను కూడా తన డైలాగుల్లో తెలియజేస్తు ఉంటాడు. అలా భాదల్లో ఉన్నవారికి దైర్యన్నిచ్చే మాటలను ను కూడా ఆయన సినిమాల్లో చెబుతూ ఉంటాడు. ఇక మిగతా డైరెక్టర్లు డిఫరెంట్ కథలను ఎంచుకుంటారు. ఎక్కువగా చాలా మంది డైరెక్టర్లు ఫిక్షన్ స్టోరీలను రాస్తూ ఉంటారు. దానివల్ల ఆడియన్ సినిమాకి కనెక్ట్ అవుతారో లేదో తెలియదు. అలాంటి సినిమాలు ఆడితే ఆడతాయి, లేదంటే ప్లాప్ అవుతాయి. కానీ పూరి జగన్నాథ్ సినిమాలు మాత్రం ఎలా ఉన్నా మనం ఒకటి, రెండుసార్లు చూసేలా బోర్ లేకుండా ఉంటాయని విజయేంద్ర ప్రసాద్ చెప్పడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి..