Vijayendra Prasad And Rajamouli: దర్శకధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి…ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న రాజమౌళి ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశముగా మారింది. మొత్తానికైతే మహేష్ బాబును ఈ సినిమా కోసం ఆయన విపరీతంగా కష్టపెడుతున్నాడు. 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 3000 కోట్ల కలెక్షన్స్ ను సాధిస్తుందనే నమ్మకంతో మేకర్స్ అయితే ఉన్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
రాజమౌళి మొదటి నుంచి కూడా తన సినిమా ఒకటి సెట్స్ మీద ఉండగానే తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే విషయంలో చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ‘త్రిబుల్ ఆర్’ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే తన తర్వాత మహేష్ బాబు తో సినిమా చేస్తున్నానని ఓపెన్ గా చెప్పిన రాజమౌళి ఇప్పుడు సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే తన తదుపరి సినిమాను అల్లు అర్జున్ తో చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఇప్పటికే తన తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్ సైతం ఆ కథను సిద్ధం చేసే పనులు బిజీగా ఉన్నాడట. రాజమౌళి – అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటివరకు సినిమా రాలేదు. ఒకవేళ వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఊహించుకుంటున్నాడు.
ఇక అలాంటి ఊహలకు పుల్ స్టాప్ పెడుతూ తన తదుపరి సినిమా అల్లు అర్జున్ తో చేయబోతున్నట్టుగా రాజమౌళి స్నేహితుల నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇక ఈ విషయం మీద అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…