TVK Party: ఏ రాష్ట్రంలో అయినా మూడవ పార్టీ కి అధికారం దక్కడం చాలా కష్టం అనేది గతం లో ఎన్నోసార్లు రుజువు అయ్యింది. మూడవ పార్టీ రెండు ప్రధాన పార్టీల మధ్య ఓటు షేర్ ని చీల్చి , ఎదో ఒక ప్రధాన పార్టీ ని అధికారం లోకి తీసుకొని రావడమే ఇది వరకు జరిగింది. ఒక్క ఎన్టీఆర్, ఎంజీఆర్ విషయం లోనే మ్యాజిక్ జరిగింది. వాళ్లిద్దరూ పార్టీలు స్థాపించినప్పుడు బోలెడంత పొలిటికల్ స్పేస్ ఉండడం వల్లే అది సాధ్యమైంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఇక మూడవ పార్టీ రాష్ట్ర రాజకీయాలను ఏ రేంజ్ మలుపు తిప్పిందో చిరంజీవి ‘ప్రజా రాజ్యం’, పవన్ కళ్యాణ్ ‘జనసేన’ సమయం లో మనమంతా చూశాము .చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అప్పట్లో 18 శాతం ఓటు షేర్ ని సంపాదించి, కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి వచ్చేలా చేసింది.
లేదంటే అప్పట్లో మహాకూటమి సంచలన విజయం సాధించి ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. అదే విధంగా 2014 ఎన్నికల్లో ఓటు చీలకుండా టీడీపీ కూటమి అధికారం లోకి రావడానికైనా , 2019 లో ఓటు చీలి టీడీపీ పార్టీ అధికారాన్ని కోల్పోవడం లో అయినా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రధాన పాత్ర పోషించింది. ఇక 2024 ఎన్నికల్లో కూటమి సంచలన విజయం సాధించి అధికారం లోకి రావడానికి కూడా కారణం జనసేన పార్టీనే. ఇప్పుడు తమిళనాడు లో హీరో విజయ్ స్థాపించిన TVK పార్టీ కూడా అలాంటి పాత్రనే పోషించబోతుంది. తమిళనాడు లో AIDMK కూటమి కి సరైన నాయకత్వం లేక చాలా బలహీనమైన పరిస్థితిలో ఉంది. కానీ అక్కడ రెండవ అతి పెద్ద పార్టీ అదే. సంస్థాగతంగా ఆ పార్టీ కి ఉండే ఓటు బ్యాంకు చాలా స్ట్రాంగ్.
కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈసారి వేరే లెవెల్ లో జరిగిందని అంటున్నారు. ఎన్నికల ముందు విజయ్ DMK పార్టీ ఓటు షేర్ ని చీలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అనుకున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ప్రకారం అది జరగలేదు , ప్రభుత్వ వ్యతిరేక ఓటు నే విజయ్ చీల్చాడు అంటూ చెప్పుకొచ్చాయి ఎగ్జిట్ పోల్ సర్వేలు. TVK పార్టీ కి 10 నుండి 20 శాతం మధ్యలో ఓటు షేర్ నమోదు అయ్యే అవకాశం ఉందని , ఈ కారణం చేతనే DMK పార్టీ ఈ ఎన్నికల్లో సునామీ సృష్టించి 150 కి పైగా స్థానాల్లో విజయ కేతనం ఎగురవేస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో తెలియాలంటే మే 4 వరకు ఆగాల్సిందే.