Leo Trailer: బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు లోకేష్ కనకరాజ్. ఖైదీ చిత్రం ఆయనకు ఎక్కడలేని ఫేమ్ తెచ్చింది. విజయ్ తో చేసిన మాస్టర్ తో పర్వాలేదు అనిపించుకున్నాడు. అయినా వసూళ్ల పరంగా భేష్ అనిపించింది. ఇక లోకేష్ కనకరాజ్ గత చిత్రం విక్రమ్ ప్రభంజనం సృష్టించింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా విక్రమ్ తెరకెక్కింది. కమల్ హాసన్ ని వీర ఫార్మ్ లోకి తెచ్చిన విక్రమ్ నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
దీంతో లోకేష్ కనకరాజ్ ఆల్ ఇండియా టాప్ స్టార్స్ మోస్ట్ వాంటెడ్ అయ్యాడు. అలాంటి డైరెక్టర్ నుండి వస్తున్న దళపతి విజయ్ మూవీ లియో పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. నేడు లియో ట్రైలర్ విడుదల కాగా రెండు రోజులు ముందు నుండే సోషల్ మీడియాలో మోత మోగుతుంది. దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న లియో ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. దాదాపు మూడు నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ మైండ్ బ్లాక్ చేసింది.
యాక్షన్ ప్రధానంగా సాగిన లియో ట్రైలర్ లో ఎమోషన్స్, ట్విస్ట్స్, థ్రిల్స్ కూడా చోటు చేసుకున్నాయి. విజయ్ రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఒకటి ఫ్యామిలీ మాన్ పార్థ, మరొకటి పోలీస్ ఆఫీసర్ లియో. ఒక సీరియల్ కిల్లర్ గురించి హీరో వివరిస్తున్న వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలెట్ కానున్నాయి. విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు ట్రైలర్ ని బట్టి తెలుస్తుంది.
లియో పోలికలతో ఉన్న పార్థ ని గ్యాంగ్స్ వెంటాడుతుంటే అతడు అసహనం ఫీల్ అవుతున్నాడు. అర్జున్, సంజయ్ దత్ పాత్రలు ఆసక్తిరేపుతున్నాయి. ఇక త్రిష విజయ్ భార్య పాత్రలో కనిపిస్తుంది. ట్రైలర్ ని అద్భుతమైన కట్స్ తో లోకేష్ కనకరాజ్ పరుగెత్తించారు. లోకేష్ సినిమాల సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే. ఆయన చిత్రాల్లో స్క్రీన్ ప్లే మెస్మరైజ్ చేస్తుంది. మొత్తంగా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ ఉంది. చివర్లో అనిరుధ్ బీజీఎమ్ గురించి చెప్పుకోవాలి. మరోసారి ఆయన సత్తా చాటాడు. లియో అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు.