Vijay Sethupathi Gandhi Talks OTT: మన సౌత్ ఇండియా లో సరికొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందు ఉండే హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi). మనల్ని నమ్మి, డబ్బులు, విలువైన సమయాన్ని వెచ్చించి థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులకు ఎదో ఒక సరికొత్త అనుభూతిని అందించాలి అనే తపన ఉండే హీరో. సక్సెస్ లు వచ్చినా , ఫెయిల్యూర్ వచ్చినా, తానూ చేయాలనుకున్నది చేసుకుంటూ ముందుకెళ్తుంటాడు. అందుకే విజయ్ సేతుపతి కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. రీసెంట్ గానే ఆయన ‘గాంధీ టాక్స్’ అనే చిత్రం చేసాడు. ఇదొక మూకీ సినిమా. అంటే సినిమా మొత్తం మీద ఒక్క డైలాగ్ కూడా ఉండదు, సైలెన్స్ తోనే సినిమా సాగుతుంది. ఇలాంటి మూకీ సినిమాలు ఈమధ్య కాలం లో రాలేదు. అప్పట్లో సింగీతం శ్రీనివాస రావు ‘పుష్పక విమానం’ అనే మూకీ సినిమా తీసాడు. కమల్ హాసన్ ఇందులో హీరో.
1987 వ సంవత్సరం లో ఈ చిత్రం విడుదలైంది. అంటే దాదాపుగా 38 సంవత్సరాలు అయ్యింది. మళ్లీ ఈ జానర్ లో సినిమా తీయడానికి ఏ డైరెక్టర్ కూడా సాహసించలేదంటే ఎంతటి కష్టమైన జానర్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. నిన్న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. జీ5 సంస్థ ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ ని కొనుగోలు చేసింది. థియేటర్స్ లో నిన్న విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి చాలా మిశ్రమ స్పందన లభించింది. కనీసం వారం రోజులు కూడా థియేటర్స్ లో నిలిచే పరిస్థితి లేదు . జీ5 సంస్థ తో ఈ మూవీ మేకర్స్ నాలుగు వారాల ఒప్పందం పై డీలింగ్ చేసుకున్నారు. ఇప్పుడు థియేటర్స్ లో ఈ చిత్రానికి రన్ రావడం లేదు కాబట్టి రెండు వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఈ చిత్రానికి కిశోరె పాండురంగ బేలేకర్ దర్శకత్వం వహించాడు. ఇందులో అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరీ, సిద్దార్థ జాదవ్ తదితరులు కీలక పాత్రలు పోషించగా, AR రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ ని అందించాడు. ఈ చిత్రం 2023 వ సంవత్సరం లో భారతీయ అంతర్జాతీయ చాలాచిత్రోత్సవ వేడుకల్లో ప్రదర్శితమైంది. కానీ కొన్ని అనుకోని సంఘటనలు ఎదురు అవ్వడం వల్ల, ఈ చిత్రం విడుదల అయ్యేందుకు మూడేళ్ళ సమయం పట్టింది. క్రిటిక్స్ నుండి మంచి రివ్యూస్ అయితే వచ్చాయి కానీ, అందుకు తగ్గ ప్రొమోషన్స్ చేయకపోవడం వల్ల, ఈ సినిమా విడుదలైంది అనే విషయం కూడా చాలా మందికి తెలియలేదు.