Hero Vijay: అనారోగ్యంతో విజయ్ తండ్రి .. పంతాలను పక్కన పెట్టిన హీరో!

గతంలో విజయ్ పేరుతో ఏకంగా ఒక రాజకీయ పార్టీ ని పెట్టిన చంద్రశేఖర్ అదే పేరుతో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు. అప్పటిలో ఇది దుమారాన్ని రేపాయి. దీనితో రంగంలోకి దిగిన విజయ్ వాటిని ఖండిచటమే కాకుండా తన అనుమతి లేకుండా ఇలాంటి పనులు చేసినందుకు పోలీసు కేసు పెట్టారు.

Written By: Shiva, Updated On : September 14, 2023 5:44 pm

Hero Vijay

Follow us on

Hero Vijay: తండ్రి కొడుకుల మధ్య విభేదాలు సహజం .. ఒక్కోసారి కొడుకు చేసే పనులు తండ్రి కి నచ్చకపోవటం, తండ్రి చేసే పనులు కొడుకుకు నచ్చకపోవడం సహజమే. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆయన తండ్రి చంద్రశేఖర్ మధ్య గత కొద్దికాలంగా విభేదాలు ఉన్నాయి. అవి ఎంతలా అంటే సొంత తండ్రి మీదే ఏకంగా పోలీసు కేసు పెట్టే స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య వివాదాలు చెలరేగాయి. దీనితో కొన్నేళ్ల నుంచి తండ్రి కి దూరంగా ఉంటున్నారు విజయ్.

గతంలో విజయ్ పేరుతో ఏకంగా ఒక రాజకీయ పార్టీ ని పెట్టిన చంద్రశేఖర్ అదే పేరుతో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు. అప్పటిలో ఇది దుమారాన్ని రేపాయి. దీనితో రంగంలోకి దిగిన విజయ్ వాటిని ఖండిచటమే కాకుండా తన అనుమతి లేకుండా ఇలాంటి పనులు చేసినందుకు పోలీసు కేసు పెట్టారు. దీనితో తండ్రి కొడుకుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ తర్వాత రాజకీయాల విషయంలో విజయ్ తండ్రి సైలెంట్ అయ్యాడు.

తాజాగా చంద్రశేఖర్ కు గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరగడంతో ఆయనను కలిసి పరామర్శించారు విజయ్. కొన్ని రోజులు అమెరికా వెళ్లిన విజయ్ అక్కడి నుండి చెన్నై వచ్చిన వెంటనే తన తండ్రిని కలిశాడు. వాటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తన తల్లితో విజయ్ దిగిన స్పెషల్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. గతంలో వారిసు సినిమాలో తండ్రి గురించి విజయ్ చెప్పిన సెంటిమెంట్ డైలాగ్స్ పై అప్పట్లో కామెంట్స్ వచ్చాయి.

సొంత తండ్రిని దూరంగా పెట్టిన వాడు, సినిమాల్లో మాత్రం భారీ డైలాగ్స్ చెబుతున్నారు అని, ఇప్పుడు విజయ్ తన తండ్రిని కలిసి ఇలాంటి వాటికి చెక్ పెట్టారు. ఇక్కడ గమ్మతైన విషయం ఏమిటంటే తన పేరు మీద రాజకీయం మొదలు పెట్టిన తండ్రి తో గొడవ పెట్టుకొని ఇన్నేళ్లు దూరంగా ఉన్న విజయ్. రీసెంట్ టైం లో రాజకీయంగా యాక్టీవ్ అవుతున్నట్లు కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తుంది. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లియో’ సినిమా వచ్చే నెల 19 న విడుదలకు సిద్ధంగా ఉంది.