Leo Movie Tickets : లియో క్రేజ్… ఒక్క గంటలో ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయో తెలుసా?

వంద కోట్ల ఫస్ట్ డే గ్రాస్ లియో అలవోకగా అందుకుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. లియో పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

Written By: NARESH, Updated On : October 15, 2023 5:19 pm

Leo Song Badass

Follow us on

Leo Movie Tickets : కోలీవుడ్ టాప్ స్టార్ గా అవతరించాడు దళపతి విజయ్. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ కొల్లగొట్టాయి. ప్లాప్ టాక్ తెచ్చుకున్న బీస్ట్ కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. ఇక లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఆయన చేసిన లియోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో దర్శకుడు లోకేష్ కనకరాజ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు. విజయ్-లోకేష్ కనకరాజ్ మూవీ కావడం మరింత హైప్ క్రియేట్ చేసింది. జనాల్లో ఈ సినిమా పట్ల ఉన్న ఆసక్తి బుకింగ్స్ ద్వారా తెలుస్తుంది.

లియో ఆన్లైన్ బుకింగ్ మొదలైపోయింది. టికెట్స్ హాట్ కేకుల్లా ప్రేక్షకులు కొంటున్నారు. ఈ క్రమంలో లియో నయా రికార్డు సెట్ చేసింది. కేవలం ఒక గంట వ్యవధిలో బుక్ మై షోలో 80000 టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇదో రికార్డు అని చెప్పొచ్చు. ట్రెండ్ చూస్తుంటే వరల్డ్ వైడ్ లియో భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం అంటున్నారు. వంద కోట్ల ఫస్ట్ డే గ్రాస్ లియో అలవోకగా అందుకుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. లియో పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

లియో ట్రైలర్ విడుదల అనంతరం ఓ పుకారు చెలరేగింది. ఇది హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ది హిస్టరీ ఆఫ్ వైలెన్స్’ కాపీ అంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు వినిపించాయి. ఈ పుకార్ల మీద దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందించారు. రేపు లియో సినిమాను థియేటర్స్ లో చూసి ఆ విషయం మీరే తెలుసుకోండని కౌంటర్ వేశాడు. లియో సైతం లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అని సమాచారం. ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాలు డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కాయి.

లియో ట్రైలర్ లో కూడా విక్రమ్ చిత్రంతో ఓ లింక్ కి సంబంధించిన సన్నివేశం ఉంది. కాబట్టి లియో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమే. ఇక రామ్ చరణ్ గెస్ట్ ఎంట్రీ ఎంట్రీ ఉందని ప్రచారం జరుగుతుంది. దీనిపై స్పష్టమైన సమాచారం లేదు. కొందరు రామ్ చరణ్ క్లైమాక్స్ లో వస్తాడు అంటుంటే అది పుకారే అని మరికొందరు ఖండిస్తున్నారు. లియో చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్, సంజయ్ దత్ వంటి స్టార్ క్యాస్ట్ కీలక రోల్స్ చేస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది.