Vijay Deverakonda : సోషల్ మీడియా ప్రపంచంలో, సెలబ్రిటీలు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను తమ ఫ్యాన్స్ తో పంచుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను తరచుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఇలానే ఇప్పుడు విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో పెట్టిన స్టేటస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ కొద్ది నిమిషాల క్రితమే ఇన్‌స్టాగ్రామ్‌లో క్రిప్టిక్ స్టేటస్‌ను పోస్ట్ చేసాడు, దానితో పాటు ఆకర్షణీయమైన ఫోటో కూడా జోడించారు. ఇక ఆయన స్టేటస్ ఆ ఫోటో తీవ్రమైన ఊహాగానాలకు దారితీసింది.

“చాలా జరుగుతున్నాయి కానీ ఇది నిజంగా ప్రత్యేకమైనది – త్వరలో ప్రకటిస్తాను.” అంటూ ఇంగ్లీషులో రాసి ఒక అమ్మాయి చేతిని విజయ్ పట్టుకో ఉన్న ఫోటోని తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. అసలు ఈ పోస్ట్ వెనుక ఉన్న అర్థమేమిటో విజయ్ చెప్పకపోవడంతో ఇంటర్నెట్ మొత్తం ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
ముఖ్యంగా చాలామంది అభిమానులు ఇది ఈ హీరో ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్ ఏమో అని సంబరపడిపోతున్నారు. విజయ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందాన తో చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు అనే ఒక రూమర్ తెగ షికారు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఆ అమ్మాయి చేయి రష్మిక దే ఏమో.. వీరిద్దరూ త్వరలోనే నిశ్చితార్థం గురించి చెప్పనున్నారేమో అని అభిప్రాయపడుతున్నారు అభిమానులు.
అయితే మరి కొంతమంది మాత్రం ఇదంతా కేవలం ఏదో ఒక సినిమా ప్రమోషన్ గురించి అయ్యుంటుంది అని కొట్టి పడేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి మిస్టరీ పోస్టర్ల ద్వారా తమ సినిమాలపై అంచనాలను పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మన హీరోలు. ఇప్పుడు అదే పద్ధతిని విజయ్ ఫాలో అవుతున్నారని కొందరు అంటున్నారు.
మొత్తానికి ఈ పోస్ట్ పై క్లారిటీ అయితే లేదు. ఏది నిజమో తెలియాలి అంటే విజయ దేవరకొండ నే చెప్పాలి. ఇక ఈ స్టేటస్ షేర్ చేసినప్పటి నుంచి విజయ దేవరకొండ ఆ పోస్ట్ గురించి ఎప్పుడు చెపుతారో అని తెగ ఎదురుచూస్తున్నారు విజయ అభిమానులు.