Vijay Deverakonda Rashmika Marriage: సినీ ఇండస్ట్రీ లో ఎన్నో ఓపెన్ సీక్రెట్స్ ఉన్నాయి. వాటిల్లో రష్మిక(Rashimka Mandanna), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రిలేషన్ కూడా ఒకటి. వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయం అందరికీ తెలుసు. ఇది నిజం కాదు, రూమర్స్ మాత్రమే అని అటు రష్మిక కానీ, ఇటు విజయ్ దేవరకొండ కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. రీసెంట్ గా రష్మిక ని ఒక ఇంటర్వ్యూ లో మేకర్స్ అడగ్గా, దానికి ఆమె సమాధానం చెప్తూ, ఇప్పుడే ఎలాంటి కామెంట్స్ చేయను, దీని గురించి సమయం వచ్చినప్పుడు చెప్తా , ఇలాంటివి కెమెరా ఆఫ్ లో ఉన్నప్పుడు అడగండి, అసలు నిజం చెప్తాను అంటూ చెప్పుకొచ్చింది. అంటే వీళ్లకు నిజంగానే నిశ్చితార్థం జరిగిపోయింది, పెళ్లి కూడా జరగబోతుంది అంటూ వస్తున్న వార్తల్లో నిజముందని పరోక్షంగా ఈమె ఒప్పుకున్నట్టే అనుకోవచ్చు.
ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరి వివాహం ఫిబ్రవరి 26 న జరగబోతుందని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ రాజస్థాన్ లోని ఉదయపూర్ కోటాలో ఫిబ్రవరి 2న వీళ్లిద్దరు వివాహం చేసుకోబోతున్నారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అంటూ బాలీవుడ్ రిపోర్టర్స్ నుండి సోషల్ మీడియా లో ఒక వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియో ని మీరు కూడా క్రింద చూడొచ్చు. వీళ్లిద్దరు ఫిబ్రవరి 2న పెళ్లి చేసుకోబోతున్నట్టు మీడియా కి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అదే విధంగా సినీ ఇండస్ట్రీ లో ఎవరికీ కూడా వీళ్ళు ఇలా ఫిబ్రవరి 2న పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పలేదు. బహుశా ఆ బాలీవుడ్ రిపోర్టర్ పొరపాటు పడ్డాడా?, లేదా వీళ్లిద్దరు నిశ్చితార్థం ఎలా అయితే రహస్యంగా చేసుకున్నారో, పెళ్లి కూడా అలాగే చేసుకోబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబందించిన నిజానిజాలు తెలియాలంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే.
ఇక వీళ్లిద్దరి సినీ కెరీర్ విషయానికి వస్తే, రష్మిక పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్స్ ని అందుకొని, రీసెంట్ గా ‘గర్ల్ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో మన ముందుకొచ్చి మరో భారీ హిట్ ని అందుకొని మంచి ఫార్మ్ మీద ఉంది. కానీ మరోపక్క విజయ్ దేవరకొండ పరిస్థితి అలా లేదు. గీతా గోవిందం చిత్రం తర్వాత ఆయన చేసిన సినిమాలు థియేటర్స్ లో ఒక్కటి కూడా ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో అలరించలేదు. ఖుషి, కింగ్డమ్ చిత్రాలకు పాజిటివ్ టాక్స్ వచ్చాయి, కానీ కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. ప్రస్తుతం ఆయన ‘రణబలి’, ‘రౌడీ జనార్ధన’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ‘రణబలి’ చిత్రం లో హీరోయిన్ గా రష్మిక మందాన నే నటిస్తుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రమిది. కనీసం ఈ సినిమాతో అయినా విజయ్ దేవరకొండ హిట్ కొడుతాడో లేదో చూడాలి.