Vijay Deverakonda Rashmika Mandanna: రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందాన(Rashmika Mandanna) జంట, ప్రస్తుతం హనీమూన్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ కి ‘బడ్డీ మూన్’ అనే పేరు కూడా పెట్టి సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. ఈ జంటతో స్నేహితులు కూడా ఈ ట్రిప్ లో పాల్గొన్నారట. వీళ్లంతా థాయ్ ల్యాండ్ లోని కో సామ్యూయ్ అనే దీవిలో ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా, అవి బాగా వైరల్ అయ్యాయి. ప్రశాంతమైన ఉదయాలు , స్విమ్మింగ్ తో మధ్యాహ్నాలు, టేబుల్ టెన్నిస్ , పూల్ గేమ్స్ వంటి వాటితో వీళ్ళు చేస్తున్న ఎంజాయ్ మామూలు రేంజ్ లో లేదు. వాళ్ళ దినచర్యకు సంబంధించిన ప్రతీ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు.
అయితే ఈ సందర్భంగా రష్మిక పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు మేము ముగ్గురు అయ్యాం అనే క్యాప్షన్ పెట్టడం తో, పెళ్లి జరిగి నెల రోజులు అయ్యింది, అప్పుడే రష్మిక గర్భం దాల్చేసిందా , ఇంత స్పీడ్ గా ఉన్నారేంటి బాబోయ్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ రష్మిక ఆ క్యాప్షన్ పెట్టడానికి కారణం గర్భం కాదు, పొద్దు తిరుగుడు పువ్వు గురించి అట. ఆమె అప్లోడ్ చేసిన ఈ యానిమేషన్ వీడియో లో రష్మిక టీ షర్ట్ పై గుడ్డు ఫోటో ఉండడం తో అందరూ గర్భం దాల్చిందేమో అని పొరపాటు పడ్డారు. కానీ రష్మిక ఈ పొద్దు తిరుగుడు పువ్వు ని తన స్నేహితురాలిగా భావిస్తూ ఉంటుంది. ఎంతలా అంటే ఆ పువ్వు కోసమే ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ప్రత్యేకంగా ఒక పేజీని కూడా క్రియేట్ చేసేంతలా అన్నమాట.
ఇప్పుడే కాదు , గతం లో రష్మిక ఈ పేజీలో యానిమేషన్ వీడియోలు చేసి ఆ పువ్వు తో కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా, సరదాగా గడుపుతున్నట్టుగా చాలా యానిమేషన్ వీడియోలు అప్లోడ్ చేసింది. ఇప్పుడు విజయ్ తో పెళ్లి జరిగింది కాబట్టి మా ఇద్దరి జీవితం లోకి ఆయన వచ్చాడు , ఇప్పుడు మేము ఇద్దరం కాదు , ముగ్గురం అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ యానిమేషన్ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఇకపోతే వీళ్లిద్దరు కలిసి ‘రణబలి’ అనే చిత్రం కూడా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
View this post on Instagram
