Vijay Deverakonda- Ranbir Singh: ఈ ఏడాది విడుదలైన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలలో భారీ హైప్ తో విడుదలైన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’..డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా సుమారు 450 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది..ఇక తెలుగు లో అయితే ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..కేవలం 6 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా 12 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.

తెలుగునాట చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ గా నిలిచినా హిందీ డబ్ సినిమా ఇదే..ఇక ఈ సినిమాకి సీక్వెల్ త్వరలోనే తెరకెక్కనుంది..మొదటి భాగం మొత్తం శివ మీద ఉండగా..రెండవ భాగం మొత్తం దేవ్ మీద ఉంటుంది..ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ పనుల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు అయాన్ ముఖర్జీ..త్వరలోనే ఈ సీక్వెల్ లో నటించబోయ్యే హీరో హీరోయిన్ల గురించి అధికారిక ప్రకటన రాబోతుంది.
అయితే ఈ సీక్వెల్ లో హీరో గా మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించబోతున్నట్టు తెలుస్తుంది..హీరోయిన్ గా దీపికా పాడుకొనే ని తీసుకునేందుకు సంప్రదింపులు జరిపారట..అర్జున్ రెడ్డి సినిమా తో విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా పెరగలేదు..కేవలం టాలీవుడ్ వరకే ఆయన క్రేజ్ పరిమితం కాదు..బాలీవుడ్ లో కూడా విజయ్ దేవరకొండ కి లక్షల్లో అభిమానులు ఉన్నారు..ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ ‘లైగర్’ డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ కూడా సుమారు పాతిక కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది అంటే విజయ్ దేవరకొండ కి సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఆయనకీ ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొనే బ్రహ్మస్త్ర నిర్మాత కరణ్ జోహార్ పార్ట్ 2 లో దేవ్ పాత్ర కోసం అడిగారట..ఆయన అడిగిన వెంటనే విజయ్ దేవరకొండ కూడా ఒప్పేసుకునట్టు సమాచారం..కథ రీత్యా దేవ్ పాత్ర రణబీర్ కపూర్ కి తండ్రి పాత్ర అవుతుంది..అంటే విజయ్ దేవరకొండ రణబీర్ కపూర్ కి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు అన్నమాట..దీపికా పాడుకొనే తల్లి పాత్ర లో కనిపించనుంది..కథ రీత్యా దేవ్ నెగటివ్ పాత్ర..మరి నెగటివ్ పాత్రలో మన రౌడీ బాయ్ ఎలా అలరిస్తాడో చూడాలి.