Vijay Deverakonda Trouble: ‘లైగర్’ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి అసలు ఏం బాగాలేదు. సాయంత్రం షోలకు థియేటర్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. ప్రస్తుతం బుకింగ్స్ కూడా గొప్పగా ఏమి లేవు అని బుక్ మై షో టీమ్ చెబుతుంది. ఈ లెక్కన లైగర్ సినిమాకి భారీగా నష్టాలు రాబోతున్నాయి. ముఖ్యంగా సినిమా స్క్రిప్ట్ విషయంలో పూరి పై భారీగా నెగిటివ్ టాక్ నడుస్తోంది. పూరి పాత కాలపు ఆలోచనలను వదులుకోలేక పోతున్నాడు అని సోషల్ మీడియాలో పూరిను బాగా ట్రోల్ చేస్తున్నారు. అయితే, లైగర్ ప్లాప్ ఇప్పుడు మరో అనుమానానికి దారి తీసింది.

మళ్ళీ స్టార్ హీరో విజయ్ దేవరకొండనే హీరోగా పెట్టుకుని పూరి జగన్నాథ్ తన డైరెక్షన్ లో ‘జన గణ మన’ అనే మరో సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే కూడా ఫైనల్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాని అపేయాలా?, లేక కంటిన్యూ చేయాలా అని విజయ్ ఆలోచన లో పడ్డాడు. మరోవైపు విజయ్ దేవరకొండ తండ్రి మాత్రం ఇక పూరితో మళ్ళీ సినిమా వద్దు అన్ గట్టిగానే వాదిస్తున్నాడట.
మరి పూరికి విజయ్ దేవరకొండ ఎలాంటి షాక్ ఇస్తాడో చూడాలి. పైగా ఈ ‘జన గణ మన’ సినిమాను కాశ్మీర్ నేపథ్యంగా పూర్తిగా డిఫెరెంట్ గా ప్లాన్ చేశాడు పూరి. అంటే, సినిమా మొత్తం కాశ్మీర్ లో ఉండదు. కొంత భాగం అక్కడ ఉంటుంది. ఈ సినిమాలో మిలిటరీ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ కనిపిస్తాడని.. విజయ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది.

కథలో మెయిన్ పాయింట్ విషయానికి వస్తే.. కాశ్మీర్ లో ప్రేమలో పడి, అక్కడే పెళ్లి చేసుకుంటాడట హీరో. అయితే.. ఆ యువతి పాకిస్తాన్ కి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ఈ హీరోయిన్ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. మరోపక్క తన పాత్ర కోసం ఇప్పటికే మిలిటరీ కటింగ్ చేయించుకున్నాడు విజయ్ దేవరకొండ. మరి ఇప్పుడు ఈ సినిమాని ఆపేస్తే.. పూరికి ఇది అవమానమే.
పాపం విజయ్ దేవరకొండ తన కెరీర్ ను తీసుకెళ్ళి పూరి చేతిలో పెట్టాడు. పూరి మొత్తానికి లైగర్ అంటూ భారీ డిజాస్టర్ ఇచ్చాడు. విజయ్ కి తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకుల్లో ఉన్న ఫుల్ పాపులారిటీ ఇప్పుడు పల్చన పడే అవకాశం ఉంది. మరోపక్క విజయ్ దేవరకొండకి కరుణ్ జోహార్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. దాంతో కరణ్ ను కూడా లైగర్ లోకి విజయ్ బలవంతంగా తీసుకొచ్చాడు. లైగర్ టాక్ కరణ్ జోహార్.. విజయ్ కి ఫోన్ చేసి సీరియస్ అయ్యాడట. కరణ్ జోహార్ – విజయ్ రిలేషన్ కూడా దెబ్బ తినే ఛాన్స్ ఉంది.

