Vijay Deverakonda- Rashmika Mandanna: స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘జన గణ మన’ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఫైనల్ అయ్యింది. ఇప్పుడు ఆమె ప్లేస్ లో రష్మిక మందన్న పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ‘రష్మిక’ కు పూరి కథ కూడా చెప్పాడు. రష్మిక మందన్నా కూడా ‘జన గణ మన’లో హీరోయిన్ గా చేయడానికి అంగీకరించింది. విజయ్ దేవరకొండే ఆమెను ఈ సినిమాలో నటించడానికి ఒప్పించాడు. మొత్తానికి రష్మిక మందన్నా విజయ్ దేవరకొండతో, పూజా హెగ్డే కి షాక్ ఇచ్చింది.

రష్మిక మందన్నా తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకుల్లో కూడా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం ముంబైలో రష్మిక భారీ హంగామా చేయడానికి కారణం విజయ్ దేవరకొండ అట. రష్మిక మందన్నాకి హిందీలో ఛాన్స్ లు రావడం వెనుక విజయ్ హస్తం ఉందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండకి కరుణ్ జోహార్ తో మంచి సాన్నిహిత్యం ఉంది.
Also Read: Chiranjeevi Movie: 50 లక్షలతో తీసిన ఈ సినిమా అప్పట్లో ఎంత వసూలు చేసిందో తెలుసా?
రష్మిక మందన్నాను కరుణ్ జోహార్ కి పరిచయం చేసింది విజయ్ దేవరకొండ అని.. రష్మిక హిందీ సక్సెస్ అసలైన కారకుడు విజయ్ దేవరకొండ అని టాక్ నడుస్తోంది. ఇంతకీ విజయ్ తో రష్మిక మళ్లీ సినిమా ఎప్పుడు చేయనుంది అనే ప్రశ్న చాలా కాలంగా వినిపిస్తోంది. దానికి సమాధానం దక్కింది.

రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ కలయికలో జనగణ మన సినిమా రాబోతుంది. ఈ ‘జన గణ మన’ సినిమాను కాశ్మీర్ నేపథ్యంగా తీస్తున్నాడు పూరి. అంటే, సినిమా మొత్తం కాశ్మీర్ లో ఉండదు. కొంత భాగం అక్కడ ఉంటుంది. ఈ సినిమాలో మిలిటరీ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ కనిపిస్తాడని.. విజయ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది.
కథలో మెయిన్ పాయింట్ విషయానికి వస్తే.. కాశ్మీర్ లో ప్రేమలో పడి, అక్కడే పెళ్లి చేసుకుంటాడట హీరో. అయితే.. ఆ యువతి పాకిస్తాన్ కి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ఈ హీరోయిన్ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. మరోపక్క తన పాత్ర కోసం ఇప్పటికే మిలిటరీ కటింగ్ చేయించుకున్నాడు విజయ్ దేవరకొండ. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
Also Read:Pawan Kalyan: ఈ ఒక్క ఫొటో చాలు పవన్ కళ్యాణ్ స్టామినా తెలుపడానికి.. ఆ ఫొటో వైరల్ వెనుక కథ!
[…] […]